దేశాల వారీగా కరోనా వివరాలు….

Country wise corona positive cases list

 

న్యూఢిల్లీ: కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతునే ఉంది.. కానీ, వ్యాక్సిన్ మాత్రం రావడంలేదు. అమెరికా, బ్రెజిల్, ఇండియా దేశాలను కరోనా కలవరపెడుతోంది. కరోనా ధాటికి ఇండియాలోని మహానగరాలు గడగడ వణికిపోతున్నాయి. ప్రతిరోజు దాదాపుగా ఇండియాలో 25 వేలకు పైగా కేసుల నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసులు సంఖ్య ఒక కోటి 26 లక్షలకు చేరుకోగా, 5.62 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా నుంచి 73.66 లక్షల మంది కోలుకోగా.. 47.01 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. భారత దేశంలో కరోనా 8.22 లక్షల మందికి సోకగా, 22 వేల మందికి పైగా చనిపోయారు. కరోనా నుంచి భారత్ లో 5.16 లక్షల మంది కోలుకోగా 2.84 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు భారత్ లో కోటి 13 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post దేశాల వారీగా కరోనా వివరాలు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.