నేడు మండల ప్రాదేశిక ఓట్ల లెక్కింపు…

 

వరంగల్ : మండల ప్రాదేశిక ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఎంపిపి పదవుల కోసం పార్టీల పరంగా కైవసం చేసుకోవడానికి మూడు రోజుల ముందు నుండే మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. పార్టీల గుర్తులపై పోటీ చేసిన అభ్యర్థులను ఏ పార్టీకి ఆపార్టీ వారే ముందస్తుగా అభ్యర్థులను క్యాంపుకు తరలిస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో ఎంపిపి, జడ్పీ చైర్మన్‌ల ఎన్నిక ఫలితాల వెల్లడి వెంటనే ఎంపిక చేసే కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రజాప్రతినిధులు చేజారకుండా ఉండేందుకు కౌంటింగ్‌కు ముందే క్యాంపుకు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో 69 మండలాలకు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు జరిగాయి. నేడు ఎంపిటిసిల ఓట్ల లెక్కింపు పూర్తవుతుండగా 5న జడ్పీటిసి ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.

7, 8 తేదీలలో ఎంపిపి జడ్పీచైర్మన్ల ఎన్నిక ఉంటుంది. దానికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల అధికారులు వెల్లడి చేశారు. ఆ షెడ్యూల్‌ను అనుసరించి పార్టీల నేతలు ఎక్కువ ఎంపిపిలను, జడ్పి చైర్మన్లను కైవసం చేసుకోవడానికి – రూట్ మ్యాప్‌ను అమలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగ ల్ జిల్లాలో ప్రతి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ హవా కొనసాగింది. ప్రజలు కూడా టిఆర్‌ఎస్ వెంటే నడిచారు. ఎ ంపిటిసి స్థానాల్లో ఎక్కువగా టిఆర్‌ఎస్ పార్టే కైవసం చేసుకుంటున్నందున ఎంపిపిలు, జడ్పిచైర్మన్లు ప్రలోభాలతో చేజారకూడదనే ఉద్దేశంతో భారీ వ్యూహాన్ని అమలు చేశారు. జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో క్యాంపు శిబిరాలు నడుస్తున్నాయి.

ఓడిన వారిని వదిలేసి.. గెలిచిన వారిని వెంట తీసుకెళ్తున్న పార్టీల నేతలు.. నేడు ఎంపిటిసి ఓట్ల లెక్కింపులో ఓడిపోయిన అభ్యర్థులను వెంటనే వదిలేసి గెలిచిన అభ్యర్థులను క్యాం పుకు తరలిస్తున్నారు. ఈనెల 7న ఎంపిపిల ఎన్నిక ఉ న్నందున అదేరోజు నేరుగా ఎంపిటిసిలను మండల పరిషత్ కార్యాలయానికి తరలించనున్నారు. 69 మండలాల్లో 50కిపైగా మండలాలు టిఆర్‌ఎస్ కై వసం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చే స్తున్నారు. జరిగిన పోలీంగ్‌లో ఎక్కువ శాతం టిఆర్‌ఎస్ అభ్యర్థులకే ఓట్లు పడ్డాయి.

ఇందులో భాగంగా ఎంపిపిలను ఎక్కువ సంఖ్యలో గెలుచుకోవాలని వ చ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదని ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 12 మంది ఎంఎల్‌ఎలు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలం ఉన్న చోట ఎంపిటిసిలను ఆదివారమే క్యాంపు శిబిరానికి తరలించారు. వారు కూడా ఎంపిపిలను ఎక్కువగా కైవసం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Counting of Mandal Territorial Votes will be held Today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు మండల ప్రాదేశిక ఓట్ల లెక్కింపు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.