వరంగల్ నిట్ విద్యార్ధికి కరోనా సోకలేదు

  హైదరాబాద్: ఇటీవల అమెరికా వెళ్లి తిరిగి వరంగల్ కు వచ్చిన నిట్ స్కాలర్‌కు కరోనా సోకలేదని గాంధీ మెడికల్ కాలేజి వైద్యులు ప్రకటించారు. రెండు రోజుల క్రితం వరంగల్ నిట్ విద్యార్థికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని ఎంజిఎం ఆసుపత్రి ఐసొలేషన్ వార్డులో చికిత్సను అందిస్తున్న విషయం విధితమే. అయితే ఆ విద్యార్థి శాంపిల్స్ సేకరించి పూణే, హైదరాబాద్ ల్యాబ్‌లకు పంపగా, కరోనా నెగెటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఎన్‌ఐటి డైరెక్టర్ ఎన్.వి […] The post వరంగల్ నిట్ విద్యార్ధికి కరోనా సోకలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఇటీవల అమెరికా వెళ్లి తిరిగి వరంగల్ కు వచ్చిన నిట్ స్కాలర్‌కు కరోనా సోకలేదని గాంధీ మెడికల్ కాలేజి వైద్యులు ప్రకటించారు. రెండు రోజుల క్రితం వరంగల్ నిట్ విద్యార్థికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని ఎంజిఎం ఆసుపత్రి ఐసొలేషన్ వార్డులో చికిత్సను అందిస్తున్న విషయం విధితమే. అయితే ఆ విద్యార్థి శాంపిల్స్ సేకరించి పూణే, హైదరాబాద్ ల్యాబ్‌లకు పంపగా, కరోనా నెగెటివ్‌గా నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఎన్‌ఐటి డైరెక్టర్ ఎన్.వి రమణారావు, ప్రోఫెసర్లు, సిబ్బంది, విద్యార్ధులు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ విద్యార్థికి చికిత్సకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి, డిఎంహెచ్‌వో, ఎంజిఎం ఆసుపత్రికి ఎన్‌ఐటి రిజిస్ట్రార్ కృతజ్ఞతలు తెలిపారు.

వికారాబాద్‌లో కరోనా ఐసొలేషన్ సెంటర్‌ను వ్యతిరేకిస్తున్న వివిధ పార్టీలు…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారిని వికారాబాద్ ఆసుపత్రిలో ఐసొలేషన్ వార్డులో చికిత్సను అందించేందుకు వైద్యఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వార్డును వెంటనే తొలగించాలని, తమ ప్రాంతంలో కరోనా ఐసొలేషన్ వార్డు వద్దని వివిధ రాజకీయ పార్టీలు శనివారం ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎమ్మార్పీ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ర్యాలీ సమాచారం తెలుసుకున్న పోలీసులు అడ్డుకొని ర్యాలీలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

మంచిర్యాలలో కరోనా కలకలం…..
మంచిర్యాల పట్టణం నాగార్జున కాలనికి చెందిన శ్రీహర్ష ఇటలీలో ఎంఎస్ చదువుతున్నాడు. 12 రోజుల క్రితం ఇటలీ నుంచి మంచిర్యాల వచ్చాడు. అప్పటి నుంచి దగ్గు, జలుబు, జ్వరం తరచూ రావడంతో శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా, డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Coronavirus not infected to NIT Warangal student

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వరంగల్ నిట్ విద్యార్ధికి కరోనా సోకలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: