50 శాతం కంపెనీలపై కరోనా ఎఫెక్ట్

పర్యాటక, ఆతిథ్య, వైమానిక రంగాలకు భారీ దెబ్బ: ఫిక్కీ న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలే కాదు భారత్ కూడా అత్యంతగా ప్రభావితమవుతోంది. పర్యాటకం, ఆతిథ్యం, వైమానిక రంగం ఈ కరోనా వైరస్ వల్ల అత్యంతగా దెబ్బతిననున్నాయని, భారత్‌లో 50 శాతం కంపెనీలపై కరోనా ఎఫెక్ట్ ఉంటుందని, ఈ ఫలితంగా నగదు ప్రవాహం క్షీణిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసిసిఐ) నివేదిక పేర్కొంది. కరోనా వల్ల వివిధ రంగాల్లో డిమాండ్‌కు […] The post 50 శాతం కంపెనీలపై కరోనా ఎఫెక్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
పర్యాటక, ఆతిథ్య, వైమానిక రంగాలకు భారీ దెబ్బ: ఫిక్కీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలే కాదు భారత్ కూడా అత్యంతగా ప్రభావితమవుతోంది. పర్యాటకం, ఆతిథ్యం, వైమానిక రంగం ఈ కరోనా వైరస్ వల్ల అత్యంతగా దెబ్బతిననున్నాయని, భారత్‌లో 50 శాతం కంపెనీలపై కరోనా ఎఫెక్ట్ ఉంటుందని, ఈ ఫలితంగా నగదు ప్రవాహం క్షీణిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసిసిఐ) నివేదిక పేర్కొంది. కరోనా వల్ల వివిధ రంగాల్లో డిమాండ్‌కు సప్లైకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడనుందని, దీంతో దేశీయ ఆర్థిక వృద్ధికి పలు సమస్యలు తలెత్తనున్నాయని వెల్లడించింది.

ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని దేశం ఎదుర్కొంటుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసిక ఫలితాలు అంత ఆశాజనకంగా లేవని, గత ఆరేళ్లుగా ఆర్థిక వృద్ధి మందగమనంలో కొనసాగుతూ 4.7 శాతం మాత్రమే నమోదవుతుందని ఫిక్కీ పేర్కొంది. దేశంలోని వివిధ రంగాల పారిశ్రామిక వర్గాలతో కలిసి చర్చించిన ఈ సర్వే రూపొందించారు. దేశవ్యాప్తంగా ఉన్న 53 శాతం కంపెనీలపై కరోనా ప్రభావం పడి 80 శాతం నగదు ప్రవాహం క్షీణిస్తుందని వెల్లడించింది. ఈ క్షీణత వల్ల ఆయా కంపెనీలు జరపాల్సిన చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, లోన్ తిరిగి చెల్లింపులు, పన్నులు కట్టడానికి ఇబ్బందులు ఎదురవుతాయని వివరించింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆర్‌బిఐ పాలసీ రేట్లను 100 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించాల్సిన అవసరం ఉందని ఫిక్కీ సర్వే అభిప్రాయపడింది.

Coronavirus effect on 50 percent of companies

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 50 శాతం కంపెనీలపై కరోనా ఎఫెక్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.