తెలంగాణలో మూడేండ్ల బాలుడికి కరోనా

Coronavirus

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరింది. రాష్ట్రంలో బుధవారం మరో రెండు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కూకట్ పల్లికి చెందిన 43 ఏళ్ల మహిళకు టెస్టుల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇటీవలే లండన్ నుంచి ఆమె భర్తకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కూకట్ పల్లి మహిళతో రాష్ట్రంలో రెండోదశ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. ఇటీవల సౌదీఅరేబియా నుంచి వచ్చిన మూడేళ్ళ బాలుడికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. అటు ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలకు కరోనా వైరస్ వ్యాపించింది.

ప్రపంచ వ్యాప్తంగా 4.68 లక్షల మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా మృతుల సంఖ్య 21వేలు దాడింది. కరోనాతో బుధవారం ఒక్కరోజే ఇటలీలో 683 మంది చనిపోయారు. కరోనాతో స్పెయిన్ లో 454 మంది, ఫ్రాన్స్ లో 231 మంది మృతి చెందారు. అటు అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకు పరిస్థితి మిషమిస్తోంది. నిన్న ఒక్కరోజే 10వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో నిన్న 130మంది మృత్యువాత పడ్డారు. వైద్య ఆరోగ్య సిబ్బందికి కరోనా వైరస్ సోకకుండా తెలంగాణ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటుంది. పర్సనల్ ప్రొటెక్సన్ ఎక్విప్ మెంట్ ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు.

Coronavirus cases reaching 41 in telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలో మూడేండ్ల బాలుడికి కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.