రాష్ట్రంలో 45 కరోనా కేసులు

  డాక్టర్ దంపతులకూ కరోనా కుత్బుల్లాపూర్, బుద్ధనగర్ వ్యక్తులకు వైరస్ సన్నిహితంగా మెలిగిన వారి వివరాల సేకరణలో అధికారుల నిమగ్నం, 7కు చేరుకున్న ట్రాన్స్‌మిషన్ కేసులు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యా యి. తొలిసారి ఇద్దరు వైద్యులకు కరోనా సోకడంతో అధికారు ల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్ దోమలగూడ ప్రాంతాని కి చెందిన బార్యభర్తలకు కొవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించారు.అదే విధంగా కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 […] The post రాష్ట్రంలో 45 కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

డాక్టర్ దంపతులకూ కరోనా

కుత్బుల్లాపూర్, బుద్ధనగర్ వ్యక్తులకు వైరస్
సన్నిహితంగా మెలిగిన వారి వివరాల సేకరణలో అధికారుల నిమగ్నం,
7కు చేరుకున్న ట్రాన్స్‌మిషన్ కేసులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కరోనా కేసులు నమోదయ్యా యి. తొలిసారి ఇద్దరు వైద్యులకు కరోనా సోకడంతో అధికారు ల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్ దోమలగూడ ప్రాంతాని కి చెందిన బార్యభర్తలకు కొవిడ్ 19 పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించారు.అదే విధంగా కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికీ, బుద్ధనగర్ వ్యక్తికీ కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం కొత్తగా న మోదైన 4 కేసులు కలుపుకొని రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 45కు చేరుకుంది. కరోనా సోకిన వివరాలు పరిశీలిస్తే… కుత్బుల్లాపూర్‌కి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీ వెళ్లి తిరిగి రాష్ట్రానికి వచ్చాడు. అనుమానిత లక్షణాలు ఉండటంతో అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా
సోకినట్లు నిర్ధారించారు.

ఇప్పటికే ఈ వ్యక్తి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించగా, అతనితో సన్నిహితంగా, ప్రత్యక్షంగా కలసిన వ్యక్తులను అధికారులు గుర్తిస్తున్నారు. ఢిల్లీలో కరోనా సోకిన వ్యక్తిని కలిసి ఉండటం వలనే ఈ వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. సికింద్రాబాద్ బుద్దానగర్‌కు చెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీనుంచి తిరిగి వచ్చారు. అనుమానిత లక్షణాలు ఉండడంతో పరిక్షించిన వైద్యులు కరోనాగా నిర్ధారించారు. అదే విధంగా దోమలగూడలో నివాసముండే వైద్యులకూ కరోనా తేలడంతో స్థానిక ప్రజలతో పాటు వైద్యులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే వారు ఎక్కడ ప్రయాణించారు? ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవర్ని కలిశారు? అనే వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా వారిద్దరు ఇటీవల కాలంలో విదేశీ ప్రయాణం చేసిన సందర్భాలు లేకపోవడం గమనార్షం.

ఇప్పటి వరకు రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు, వారి నుంచి కుటుంబ సభ్యులకూ లేదా సమీపస్తులకు కరోనా సోకింది. కానీ తాజాగా నమోదైన ఇద్దరు వైద్యులు విదేశాలకు వెళ్లలేదు. అక్కడ నుంచి వచ్చిన ఎవరినీ కలువలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే వీరు వృత్తిలో భాగంగా రోగులను చెక్ చేసేక్రమంలో ఇతరుల నుంచి వ్యాధి సోకి ఉండవచ్చని వైద్య ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వారు వైద్యం చేసిన పేషెంట్ల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత దోమలగూడ సమీపంలోని 800 ఇళ్ల వద్దకు వీరిద్దరు నేరుగా వెళ్లి ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే పరీక్షలు చేపించుకోవాలని సూచించినట్లు సమాచారం. పాజిటివ్ వచ్చిన ముగ్గురిని ఐసొలేషన్‌కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.

Coronavirus cases in Telangana climb to 45

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాష్ట్రంలో 45 కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: