కరోనా కరాళ నృత్యం

  దేశంలో 694కి పెరిగిన కేసులు మరణాల సంఖ్య 16 జాబితాలో కొత్తగా చేరిన గోవా రాష్ట్రంలో మూడు కరోనా కేసులు నమోదు న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రో జుకు పెరిగిపోతున్నాయి. గురువారం నాటికి దేశంలో కరోనా కేసులు 694కి చేరుకోగా, మృతుల సంఖ్య 13కు నెరిగింది. గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలు వెలెలడించింది. కాగా మంత్రిత్వ శాఖ రూపొందించిన చార్ట్‌లో తొలిసారిగా […] The post కరోనా కరాళ నృత్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశంలో 694కి పెరిగిన కేసులు
మరణాల సంఖ్య 16
జాబితాలో కొత్తగా చేరిన గోవా
రాష్ట్రంలో మూడు కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రో జుకు పెరిగిపోతున్నాయి. గురువారం నాటికి దేశంలో కరోనా కేసులు 694కి చేరుకోగా, మృతుల సంఖ్య 13కు నెరిగింది. గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలు వెలెలడించింది. కాగా మంత్రిత్వ శాఖ రూపొందించిన చార్ట్‌లో తొలిసారిగా గోవా కూడా చోటు దక్కించుకొంది. ఈ రాష్ట్రంలో తాజాగా మూడు కరోనా కేసులు నమోదైనాయి. గురువారం 10.15 గంటలకు తాజాగా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలను బట్టి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా ము గ్గురు చనిపోగా గుజరాత్‌లో ఇద్దరు మృతి చెందారు.

మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్, కర్నాటక, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ , హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్‌లలో ఒక్కొక్కరు చనిపోయారు. మంత్రివర్గం విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 593 కాగా, మరో 42మంది నయం కావడం లేదా ఆస్పత్రినుంచి డిశ్చార్జి కాగా, ఒక వ్యక్తి వలస వెళ్లారు. దేశం లో నమోదైన మొత్తం 649 కేసుల్లో 47మంది విదేశీయులున్నారని కూడా మంత్రిత్వశాఖ తెలిపింది. రాష్ట్రాల వారీగా చూసినట్లయితే మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధికంగా 142 కోవిడ్19 కేసులు నమోదు అయ్యా యి. వీరిలో ముగ్గురు విదేశీయులున్నారు.ఆ తర్వాతి స్థానంలో కేరళ ఉంది. ఇక్కడ కరోనా కేసులు 118కి చేరుకోగా వీరిలో ఎనిమిది మంది విదేశీయులున్నారు. తెలంగాణాలో కేసుల సంఖ్య 41కాగా, వీరిలో పదిమం ది విదేశీయులున్నారు. కర్నాటకలో కూడా కరోనా కేసు లు 41కు చేరుకున్నారు. గుజరాత్‌లో ఒక విదేశీయుడు సహా 38 మందికి ఈ వైరస్ సోకింది.

రాజస్థాన్‌లో ఇద్ద రు విదేశీయులు సహా 38 మందికి వైరస్ సోకగా, యుపి లో ఒక విదేశీయుడు సహా 37 మందికి కరోనా సోకింది. మరో వైపు ఢిల్లీలో ఒక విదేశీయుడు సహా 35మందికి ఈ వైరస్ సోకింది. కాగా పంజాబ్‌లో 33 కేసులు, హర్యానాలో 14 మంది విదేశీయులు సహా 30 మందికి ఈ వైర స్ సోకినట్లు గుర్తించారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 26కు పెరగ్గా వీరిలో ఆరుగురు విదేశీయులున్నారు. చండీగఢ్‌లో ఇప్పటివరకు ఏడు కేసులు వెలుగు చూడగా, ఉత్తరాఖండ్‌లో ఒక విదేశీయుడు సహా ఐదుగురికి ఈ వైరస్ సోకింది, బీహార్, చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ముగ్గురేసి, ఒడిశాలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. తాజాగా గోవాలో ముగ్గురికి కరో నా వైరస్ సోకింది. మొదట్లో ఈ రాష్ట్రంలో 33 కేసులు నమోదైనట్లు పేర్కొన్న మంత్రిత్వ శాఖ ఆ తర్వాత ఆ పొరబాటును సరిదిద్దుకుంది. కాగా పుదుచ్చేరి, మిజో రాం, మణిపూర్‌లలో ఒక్కో కేసు వెలుగు చూసింది.

ఢిల్లీలోని మౌజ్‌పూర్ మొహల్లా క్లినిక్‌లో పని చేస్తున్న ఓ వైద్యుడితో పాటుగా అతని భార్య, కుమార్తెలకు కూడా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ అధికార యంత్రాంగం ఇటీవలి కాలంలో ఆ క్లినిక్‌కు వెళ్లిన దాదాపు 900 మందిని క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే సౌదీ అరేబియానుంచి వచ్చిన ఓ మహిళ కరోనా లక్షణాలతో క్లినిక్‌కు వెళ్లడంతో వైద్యుడికి కరో నా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌గా తేలిన వైద్యుడిని కలిసిన వారినందరినీ 14 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఢిల్లీ లో ఇప్పటివరకు 36 కరోనా కేసులు నమోదైనట్లు చెప్పారు.

ఈ నెల 12న సౌదీనుంచి వచ్చిన మహిళ మౌజ్‌పూర్ మొహల్లా క్లినిక్‌కు వెళ్లడంతో వైద్యుడికి కరోనా సోకినట్లు ఆయన చెప్పారు. ఆ మహిళకు ఐదు రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పా రు. ఆ మహిళతో సన్నిహితంగా ఉండిన మరో ఐదుగురికి కూడా వైరస్ సోకిందని వెల్లడించారు. వీరిలో ఆమె తల్లి, సోదరుడు, ఇద్దరు కుమార్తెలు, ఆమెను ఎయిర్‌పోర్టునుంచి ఇంటికి తీసుకువచ్చిన బంధువు కూడా ఉన్నారని తెలిపారు. అలాగే ఆమె బంధువులతో పాటుగా చుట్టుపక్కల సన్నిహితంగా ఉండే మరో 74 మందిపై కూడా నిఘా ఉంచినట్లు తెలిపారు.

మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా ఈ నెల 12నుంచి 18వర కు క్లినిక్‌కు వచ్చిన వారంతా కూడా 15 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరింది. కాగా మొహ ల్లా క్లినిక్ వైద్యుడికి కరోనా వైరస్ సోకడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పందించారు. ఈ ఒక్క ఘటన తప్పించి మిగిలిన అన్ని మొహల్లా క్లినిక్‌లు తెరి చే ఉంటాయని ప్రకటించారు. లేకపోతే పేదలు వై ద్యంకోసంపెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నా రు. క్లినిక్స్‌లో వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. మరోవైపు కరోనా సోకిన వారి సంరక్షణ బాధ్యతలు చూస్తున్న వైద్య సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీప్రభుత్వం నిర్ణయించింది. కరోనా టెస్టుల కోసం రక్తనమూనాలు సేకరించే వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

Coronavirus cases in India climb to 694

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనా కరాళ నృత్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: