సహకార శాఖ మంత్రికి కరోనా

Corona Positive to Tamilnadu Minister Sellur K Rajuచెన్నయ్ : తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడు సహకార శాఖ మంత్రి సెల్లూరు కె.రాజుకు కరోనా సోకింది. దీంతో ఆయన్నుచికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత సోమవారం సెల్లూరు కె.రాజు భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ఇటీవల తమిళనాడు మంత్రులు కెపి అన్బాలగన్, పి.తంగమణికి కరోనా సోకడంతో ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడులో ఇప్పటివరకు 1,22 లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1700 మంది కరోనా బారిన పడి చనిపోయారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సహకార శాఖ మంత్రికి కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.