కరోనా వ్యాప్తి నిరోధానికి రూ.20 లక్షల విరాళం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నారు. కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని ప్రశంసించిన ఆయన రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో 10 లక్షల రూపాయల విరాళాన్ని నితిన్ ప్రకటించారు. మార్చి 31వ తేదీ వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలనీ, అందరూ తమ ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తిని నిరోధించడంలో పాలుపంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Corona: Nithin donates rs.10 lakhs each to Telugu States

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనా వ్యాప్తి నిరోధానికి రూ.20 లక్షల విరాళం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.