క్రీడలపై కరోనా పిడుగు

  క్రీడా విభాగం: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా (కోవిడ్19) ప్రభావంతో క్రీడా రంగం కుదేలవుతోంది. కరోనా భయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు పెద్ద క్రీడలు రద్దు కావడం కానీ, వాయిదా పడడం కానీ జరిగాయి. ఐపిఎల్ వంటి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఐపిఎల్ వల్ల వాయిదా పడింది. అంతేగాక దక్షిణాఫ్రికా -భారత్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)తో సహా ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు కూడా రద్దు కాక తప్పలేదు. అంతేగాక ప్రపంచకప్ తర్వాత అంత […] The post క్రీడలపై కరోనా పిడుగు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్రీడా విభాగం: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా (కోవిడ్19) ప్రభావంతో క్రీడా రంగం కుదేలవుతోంది. కరోనా భయం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు పెద్ద క్రీడలు రద్దు కావడం కానీ, వాయిదా పడడం కానీ జరిగాయి. ఐపిఎల్ వంటి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఐపిఎల్ వల్ల వాయిదా పడింది. అంతేగాక దక్షిణాఫ్రికా -భారత్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, పాకిస్థాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)తో సహా ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు కూడా రద్దు కాక తప్పలేదు. అంతేగాక ప్రపంచకప్ తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన యూరోకప్ ఫుట్‌బాల్ పోటీలు కూడా కరోనా వల్ల వాయిదా పడక తప్పలేదు.

అంతేగాక ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను కూడా సెప్టెంబర్ వరకు వాయిదా వేశారు. ఫార్మూలావన్ రేసులపై కూడా కోవిడ్19 ప్రభావం పడింది. ఇప్పటికే మెల్‌బోర్న్‌లో జరిగిన రేసును రద్దు చేశారు. ఇతర దేశాల్లో జరిగే రేసులను కూడా వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నారు. మరోవైపు కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అమెరికా వేదికగా జరగాల్సిన యూఎస్ ఓపెన్‌ను కూడా వాయిదా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేగాక ఇప్పటికే పలు బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లను రద్దు చేశారు. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగినా అందులో స్టార్ షట్లర్లు పాల్గొనలేదు.

ఒలింపిక్స్‌పై నీలి నీడలు
ఇక, జపాన్ వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలపై కరోనా ప్రభావం బాగానే పడింది. ఈ ఏడాది జరగాల్సిన విశ్వ క్రీడలను వాయిదా వేయాలనే డిమాండ్ రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘాన్ని కోరారు. ఇక, జపాన్ ప్రజలు కూడా ఒలింపిక్ క్రీడలను వాయిదా వేయాలని కోరుతున్నారు. జపాన్‌లో కరోనా వ్యాధి ప్రమాదకరంగా లేకున్నా ఒలింపిక్స్ క్రీడల నేపథ్యంలో దేశానికి వచ్చే వేలాది మంది విదేశీయులతో ఇది తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీడలను రద్దు చేయడం కానీ, వాయిదా వేయడం కానీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు జపాన్ ప్రభుత్వం మాత్రం క్రీడలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని ప్రకటిస్తోంది.

అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య మాత్రం ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తోంది. అన్ని దేశాల నుంచి వచ్చే సలహాలు, సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని సమాఖ్య స్పష్టం చేసింది. ఇదిలావుండగా ప్రారంభంలో చైనా, దక్షిణ కొరియా తదితర దేశాలకే పరిమితమైన కరోనా ఇప్పుడూ దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. దీని బారిన పడి స్పెయిన్, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ప్రజలు పిట్టల్ల రాలిపోతున్నారు. ఇటలీలో అయితే ఇప్పటికే రెండు వేలకు పైగా ప్రజలు కరోనా మహమ్మరికి బలయ్యారు.

స్పెయిన్, ఇరాన్‌లలో కూడా భారీ సంఖ్యలో ప్రజలు కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు యూరప్ దేశాలు కఠిన చర్యలు చేపట్టాయి. ఇప్పటికే ఐరోపాలో ఇతర ఖండాల నుంచి వచ్చే ప్రజలపై ఆంక్షలు విధించారు. పలు దేశాలకు వీసాలు రద్దు చేశారు. అమెరికా కూడా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఐరోపా దేశాలకు రాకపోకలపై నిషేధం విధించింది. ఇలా పలు దేశాలు కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో రానున్న ఐదారు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రీడలు జరిగే పరిస్థితి దాదాపు కనిపించడం లేదనే చెప్పాలి.

 

Corona effect on Sports arena

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్రీడలపై కరోనా పిడుగు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.