అమితాబ్ కుటుంబంలో జయకు తప్ప …అందరికీ కరోనా

Corona Effect On Actor Amitabh Bachchan Familyముంబయి : బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే అమితాబ్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ రావడంతో శనివారం రాత్రి నానావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అమితాబ్ భార్య జయా బచ్చన్ తో పాటు ఆయన కోడలు , అభిషేక్ భార్య  ఐశ్యర్యరాయ్‌, వారి కూతురు ఆరాధ్యకు పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఐశ్యర్యరాయ్ కు, ఆరాధ్యకు  కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. జయాబచ్చన్ కు మాత్రం నెగిటివ్ వచ్చిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. అమితాబ్ కుటుంబం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దీంతో అమితాబ్ నివసించే ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. వారి భవనానికి బిఎంసి అధికారులు సీల్ వేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్ని శానిటైజేషన్ చేశారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అమితాబ్ కుటుంబంలో జయకు తప్ప … అందరికీ కరోనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.