కరోనా మృతులు 15,000

పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 15,189కి చేరుకుంది. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని ఎఎఫ్‌పి వార్తాసంస్థ ఈ విషయాన్ని సోమవారం తెలిపింది. కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 1395 మంది మృతి చెందినట్లు అధికారిక వివరణలతో వెల్లడైంది. యూరప్‌లో అత్యధికంగా 9,197 మం ది మృతి చెందారు. సోమవారం నాటికి కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య వివరాలను ఈ వార్తాసంస్థ వెల్లడించింది. అన్ని దేశాలవారీగా చూస్తే ఇటలీలో 5476 మంది కరోనాకు […] The post కరోనా మృతులు 15,000 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 15,189కి చేరుకుంది. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని ఎఎఫ్‌పి వార్తాసంస్థ ఈ విషయాన్ని సోమవారం తెలిపింది. కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 1395 మంది మృతి చెందినట్లు అధికారిక వివరణలతో వెల్లడైంది. యూరప్‌లో అత్యధికంగా 9,197 మం ది మృతి చెందారు. సోమవారం నాటికి కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య వివరాలను ఈ వార్తాసంస్థ వెల్లడించింది. అన్ని దేశాలవారీగా చూస్తే ఇటలీలో 5476 మంది కరోనాకు బలి అయ్యారు. తరువాతి క్రమంలో వైరస్ పుట్టిన చైనాలో 3270 మంది, స్పెయిన్‌లో 2182 మంది కరోనాతో చనిపోయినట్లు నిర్థారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1,72,238 మం దికి కరోనా సోకినట్లు అధికారికంగా లెక్కలు తేల్చారు. యూరప్ దేశాలలో ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది.

స్పెయిన్‌లో ఒక్కరోజులో 462 మంది
కరోనా వైరస్ ప్రభావం స్పెయిన్‌ను కుదిపేస్తోంది. ఇక్కడ 24 గంటల వ్యవధిలోనే 462 మంది కరోనాతో మృతి చెందారు. దీనితో ఈ దేశంలో మొత్తం మృతుల సంఖ్య ఇప్పటికీ 2182కి చేరింది. ఒక్కరోజు క్రితం అధికారికంగా వెలువరించిన గణాంకాలతో పోలిస్తే మరుసటి రోజు మృతుల సంఖ్యలో అసాధారణరీతిలో 27 శాతం పెరిగింది. మరో వైపు కరోనా సోకిన వారి సంఖ్య ఇక్కడ 33,098కి చేరుకుందని మాడ్రిడ్‌లో అధికార వర్గాలు తెలిపాయి. కనివిని ఎరుగని రీతిలో లాక్‌డౌన్ ఇతరత్రా చర్యలు రెండు వారాలుగా చేపడుతున్నారు.

అయితే పరిస్థితిలో మార్పు రావడం లేదు. పైగా కరోనా వ్యాప్తి చెందుతోంది. ఈ పరిణామాన్ని తీవ్ర కలవరానికి దారితీస్తోంది. ముందుగా రెండు వారాలకు పరిమితం చేసిన లాక్‌డౌన్‌ను ఇప్పుడు వచ్చే నెల 11 వరకూ పొడిగించనున్నారు. అనివార్యంగా లాక్‌డౌన్‌ను పెంచే విషయంపై పార్లమెంట్‌లో మంగళవారం నిర్ణయం తీసుకుంటామని దేశ ప్రధాని పెడ్రో సంఛేజ్ తెలిపారు. మాడ్రిడ్‌లో కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించింది. ఇక్కడ ఒక్క చోటనే 1263 మంది కరోనాతో మృతి చెందారు. 10575 కేసులు నమోదు అయ్యాయి.

చైనాలో మరణాల సంఖ్య 3270కు చేరిక
బీజింగ్ : చైనాలో స్వదేశీ కరోనా కేసులు కొత్తగా నమోదు కాకపోయినా విదేశీయుల ద్వారా 39 కేసులు నమోదయ్యాయని, ఆదివారం తొమ్మిది మంది వైరస్‌తో చనిపోయారని చైనా నేషనల్ హెల్తు కమిషన్ (ఎన్‌హెచ్‌సి) సోమవారం ప్రకటించింది. దీంతో మరణాల సంఖ్య 3270కు చేరింది. కోలుకున్న తరువాత 72,703 మంది డిశ్చార్జి కాగా, 5120 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. విదేశీయుల కేసులు 353 కు చేరాయి. ఈ విదేశీ కేసులు మొత్తం విదేశీయులవా, లేక విదేశాల్లో ఉం టున్న చైనీయులవా అన్నది ఎన్‌హెచ్‌సి స్పష్టం చేయలేదు. విదేశీ కేసుల సంఖ్య పెరగడంతో బీజింగ్‌కు రావలసి ఉన్న అంతర్జాతీయ విమానాలన్నిటినీ చైనా లోని ఇతర 12 నగరాలకు తిరిగి సోమవారం నుంచి పంపనున్నట్టు సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ప్రకటించింది.

పాక్‌లో 799కి పెరిగిన కరోనా కేసులు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో కరోనా కేసులు 799కి పెరిగినట్టు పాక్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఐదుగురు చనిపోయారని, ఆరుగురు కోలుకున్నారని జాతీయ ప్రకృతి వైపరీత్య యాజమాన్య సంస్థ (ఎన్‌డిఎంఎ) వివరించింది. మొత్తం 799 కేసుల్లో సింధ్ ప్రావిన్స్‌లో 352, పంజాబ్‌లో 225, బెలోచిస్థాన్‌లో 104, గిల్‌గిత్ బాల్టిస్థాన్‌లో 71, ఖైబర్‌ఫక్తుంఖ్వాలో 31, ఇస్లామాబాద్ 15, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 1 నమోదయ్యాయి. ప్రైవేట్ మీడియా కథనాలు మాత్రం మొత్తం 803 కేసులు నమోదయ్యాయని, ఆరుగురు చనిపోయారని ప్రకటించింది.

Corona deaths worldwide are 15,189

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనా మృతులు 15,000 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: