దేశంలో 492కు చేరిన కరోనా కేసులు

dies

 

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మొత్తం 492 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కరోనా సోకి ఇప్పటి వరకు దేశంలో 10 మంది మరణించారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈనెల 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగునుంది. ఇక, తెలుగు రాష్ట్రాలల్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తుంది. తెలంగాణ 33, ఆంధ్రప్రదేశ్ లో 7 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రెండు రాష్ట్రాలల్లో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నగరంలో నిన్న సరైన కారణాలు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి తిరుగిన దాదాపు 2 వేల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

Corona cases raised to 492 in India

The post దేశంలో 492కు చేరిన కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.