సులువుగా తీసేయొచ్చు…!

Garlic

 

వెల్లుల్లి పొట్టును తీయాలనుకుంటే నేను తీసినట్టు మీరూ ప్రయత్నించండి అంటోంది కెనడాకు చెందిన విపెస్టిలెంజ్ అనే మహిళ. ఈ మధ్య వెల్లుల్లి పొట్టును చిన్న చాకుతో సులభంగా తీసేస్తూ ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. “మీరు కొరియన్ ఆహారాన్ని ఎక్కువగా తయారు చేయా లనుకుంటే.. వెల్లుల్లిని వలిచే సరైన పద్ధతి ఇదే” అంటూ పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది సేపటికే ఆ వీడియో వైరల్‌గా మారింది. నాలుగు రోజుల్లో 3 కోట్ల మంది చూడగా, లక్షల సంఖ్యలో కామెంట్లు, లైకులు వచ్చాయి.

వెల్లుల్లి లేనిదే వంట పూర్తికాదు. కానీ వెల్లుల్లి పొట్టును వలవాలంటే అంత సులువేం కాదు. నానా హైరానా పడిపోతుంటాం. మార్కెట్‌లో వెల్లుల్లిని వలవడానికి వచ్చే ప్రతి పరికరాన్ని కొనేస్తుంటారు కొందరు. ఇంట్లో శుభకార్యాలంటే బోలెడు వెల్లుల్లి రెబ్బలు కావాల్సి వస్తుంది. పొట్టు తీయాలంటే మాటలేంకాదు. సో.. వెల్లుల్లి బాధితులకు ఊరట కలిగించే వీడియో ఇది.

Cooking without Garlic is not Complete

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సులువుగా తీసేయొచ్చు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.