చివరి టెస్టులో కుక్ సెంచరీ…

లండన్: ఓవల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో అలిస్టర్ కుక్ సెంచరీ బాదాడు. తన కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్న కుక్(103 నాటౌట్) శతకంతో మెరిశాడు. టెస్టు కెరీర్ లో అతనికిది 33వ సెంచరీ కావడం గమనార్హం.  ఓవర్‌నైట్ స్కోరు 46తో బ్యాటింగ్ ఆరంభించిన కుక్ భారత పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతున్నాడు. శతకం పూర్తవగానే కుక్ భావోద్వేగానికి లోనయ్యాడు. గ్యాలరీలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు, డ్రెస్సింగ్ […]

లండన్: ఓవల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో అలిస్టర్ కుక్ సెంచరీ బాదాడు. తన కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్న కుక్(103 నాటౌట్) శతకంతో మెరిశాడు. టెస్టు కెరీర్ లో అతనికిది 33వ సెంచరీ కావడం గమనార్హం.  ఓవర్‌నైట్ స్కోరు 46తో బ్యాటింగ్ ఆరంభించిన కుక్ భారత పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతున్నాడు. శతకం పూర్తవగానే కుక్ భావోద్వేగానికి లోనయ్యాడు. గ్యాలరీలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న తోటి ఆటగాళ్లు నిలబడి చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. 4 రోజు ఆటను ఆరంభించిన కుక్, కెప్టెన్ జో రూట్ నిలకడగా రాణిస్తున్నారు. జో రూట్(92 నాటౌట్) కూడా శతకానికి దగ్గరలో ఉన్నాడు. లంచ్ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 243 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 283 పరుగుల ఆధిక్యంలో ఉంది.