స్వైన్‌ప్లూతో ఖమ్మంవాసి మృతి

swine flu

 

ఖమ్మం క్రైం : ఖమ్మం నగరానికి చెందిన కాంట్రాక్టర్ రంగరావు స్వైన్‌ప్లూ జ్వరంతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మామిళ్ళగూడెంకు చెందిన రంగరావు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన కాంట్రాక్టర్ పనులు చేస్తూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతుంటారు. నెల రోజుల క్రితం ముంబాయి వెళ్లినప్పుడు స్వైన్‌ప్లూ బారిన పడినటు, అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఖమ్మం మామిళ్ళగూడెం ప్రాంతంలో ఆయన ప్రముఖులు. రంగారావు మృతదేహాన్ని ఆదివారం రాత్రి ఖమ్మంకు తీసుకువచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

 

Contractor Rangarao died of swine flu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్వైన్‌ప్లూతో ఖమ్మంవాసి మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.