నగరంలో కొనసాగుతున్న ప్లాస్టిక్ వ్యర్దాల ఏరివేత

  హైదరాబాద్: గ్రేటర్‌లో ఖాళీస్దలాలు, చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్దాలను ఏరివేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. మే మాసం మొత్తం నగరంలోని ఖాళీ స్థలాలు, నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్దాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రకటించడంతో జోనల్ కమిషనర్ల నేతృత్వంలో డిప్యూటీ కమిషనర్లు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్దాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. కూకట్‌పల్లి సర్కిల్‌లో గురువారం ఒకరోజే రెండు టన్నుల బరువుగల బ్యాగ్‌ల ప్లాస్టిక్ కవర్లును సేకరించారు. శేరిలింగంపల్లి పరిధిలో రాజీవ్ స్వగృహ […] The post నగరంలో కొనసాగుతున్న ప్లాస్టిక్ వ్యర్దాల ఏరివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: గ్రేటర్‌లో ఖాళీస్దలాలు, చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్దాలను ఏరివేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. మే మాసం మొత్తం నగరంలోని ఖాళీ స్థలాలు, నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్దాల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రకటించడంతో జోనల్ కమిషనర్ల నేతృత్వంలో డిప్యూటీ కమిషనర్లు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్దాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. కూకట్‌పల్లి సర్కిల్‌లో గురువారం ఒకరోజే రెండు టన్నుల బరువుగల బ్యాగ్‌ల ప్లాస్టిక్ కవర్లును సేకరించారు. శేరిలింగంపల్లి పరిధిలో రాజీవ్ స్వగృహ కాంప్లెక్స్‌లో ప్లాస్టిక్ ఏరివేతను చేపట్టగా ముషిరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు సమీపంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్, ఇతర ఖాళీ స్దలాల్లో 25బ్యాగ్‌ల ప్లాస్టిక్ కవర్లను సేకరించారు.

ఎల్బీనగర్ సర్కిల్‌లోని వనస్దలిపురంలో నిర్వహించి ప్లాస్టిక్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో స్దానికశాసనసభ్యులు డి.సుదీర్‌రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రఘప్రసాద్ ఆధ్వర్యంలో సీతాఫల్‌మండిలో ప్లాస్టిక్ కలెక్షన్ డ్రైవ్ చేపట్టగా చందానగర్ సర్కిల్ పరిధిలో కొత్తగుంట, చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని రక్షపురం, ఉప్పల్ సర్కిల్‌లోని చిలుకానగర్, బీరప్పగూడలో గాజులరామారం సర్కిల్‌లోని అంజయ్యనగర్‌లో ప్లాస్టిక్ వ్యర్దాల తొలగింపు ప్రత్యేక డ్రైవ్ ను కొనసాగించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవమైన జూన్ 5వతేదీన నగరంలో కనీసం 200టన్నుల ప్లాస్టిక్ వ్యర్దాలను తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లక్షాన్ని నిర్ధేశించారు.

Continuous plastic wastes collection in city

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నగరంలో కొనసాగుతున్న ప్లాస్టిక్ వ్యర్దాల ఏరివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: