అతిధి అధ్యాపకులను కొనసాగించాలి…

Guest Faculty

 

హైదరాబాద్: జూనియర్ కళాశాల అతిథి అధ్యాపకులను కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల విడుదలైన అతిథి అద్యాపకుల కొత్త నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు ఈనిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాల అతి థి అద్యాపకుల రెన్యూవల్‌కు సంబంధించి 2152 నెంబర్ అధ్యాపకులసంఘం ఆధ్వర్యంలో ప్రభాకర్, ఇతరులు హైకోర్టులో వేసి న రిట్‌పిటీషన్‌పై శుక్రవారం కోర్టు ఈ ఉత్తర్వులను జారీచేసింది. ఒక తాత్కాలిక ఉద్యోగిని తొలగించి మరో తాత్కాలిక ఉద్యోగిని నియమించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని జస్టీస్ అభినందన్ కుమార్ శావలి ఈతీర్పును ఇచ్చారు.

 

Continuing junior college guest faculty

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అతిధి అధ్యాపకులను కొనసాగించాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.