సిసి కెమెరాల పనితీరును పరిశీలించాలి

కరీంనగర్ క్రైం : సిసి కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. సిసి కెమెరాల వల్ల కలిగే ప్రయోజనాలపై అన్ని వర్గాల ప్రజలకు ఆవగాహన కల్పించాలని కోరారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు చెందిన టెక్నికల్ విభాగం పోలీసులతో కమిషనర్ కమలాసన్‌రెడ్డి బుధవారం  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజలు స్వచ్చంధంగా విరాళాలు అందజేసి ఏర్పాటు చేసుకున్న కెమెరాలను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన […] The post సిసి కెమెరాల పనితీరును పరిశీలించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరీంనగర్ క్రైం : సిసి కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. సిసి కెమెరాల వల్ల కలిగే ప్రయోజనాలపై అన్ని వర్గాల ప్రజలకు ఆవగాహన కల్పించాలని కోరారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు చెందిన టెక్నికల్ విభాగం పోలీసులతో కమిషనర్ కమలాసన్‌రెడ్డి బుధవారం  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజలు స్వచ్చంధంగా విరాళాలు అందజేసి ఏర్పాటు చేసుకున్న కెమెరాలను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత టెక్నికల్ విభాగం పోలీసులపై ఉందని ఆయన పేర్కొన్నారు. సిసి కెమెరాల్లో సాంకేతిక లోపాలు ఉన్నట్లయితే వెంటనే సరిదిద్దాలని చెప్పారు. సిసి కెమెరాల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని చెప్పారు. టెక్నికల్ విభాగం పోలీసులకు సిసి కెమెరాల పనితీరు, నాణ్యత ప్రమాణాలపై మరోసారి శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. సిసి కెమెరాల పనితీరుపై ఏలాంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. సిసి కెమెరాల పుటేజీల ద్వారా చేధించబడిన సంఘటనలను ప్రజలకు వివరిస్తూ సిసి కమెరాల ఏర్పాటులో భాగస్వాములను చేయాలని చెప్పారు. సిసి కెమెరాల ఏర్పాటుతో ప్రజల్లో భద్రతపై భరోసా ఏర్పడిందని తెలిపారు. వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతి సిసి కెమెరాను తనిఖీ చేసి ఈనెల 28 వరకు నివేదిక అందించాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆవగాహన పెంపొందించుకునేందుకు ఆసక్తి చూపాలని తెలిపారు. ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుందని చెప్పారు. ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించేందుకు లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్.శ్రీనివాస్ (లా అండ్ ఆర్డర్), పి.రవీందర్ (పరిపాలన), ఐటికోటీం ఇంచార్జీ యం.ఎస్.ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

Consider the CC Cameras Performance

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సిసి కెమెరాల పనితీరును పరిశీలించాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: