కాంగ్రెస్ నుంచి నాగేశ్ ముదిరాజ్ సస్పెండ్

  మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావుపై దురుసుగా వ్యవహరించిన పిసిసి కార్యదర్శి నాగేశ్ ముదిరాజ్‌పై సస్పెన్స్ వేటు పడింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణ సంఘం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో క్రమశిక్షణా కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరైన నాగేశ్ ముదిరాజ్ ఇందిరాపార్కు వద్ద జరిగిన ఘర్షణ వివరణ ఇచ్చారు. అన్ని అంశాలపై లోతుగా పరిశీలించిన క్రమ శిక్షణా […] The post కాంగ్రెస్ నుంచి నాగేశ్ ముదిరాజ్ సస్పెండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావుపై దురుసుగా వ్యవహరించిన పిసిసి కార్యదర్శి నాగేశ్ ముదిరాజ్‌పై సస్పెన్స్ వేటు పడింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణ సంఘం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో క్రమశిక్షణా కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరైన నాగేశ్ ముదిరాజ్ ఇందిరాపార్కు వద్ద జరిగిన ఘర్షణ వివరణ ఇచ్చారు. అన్ని అంశాలపై లోతుగా పరిశీలించిన క్రమ శిక్షణా సంఘం నాగేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు రోజుల క్రితం ఇందిరాపార్క వద్ద ఇంటర్ విదార్ధులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో విహెచ్, నగేశ్ మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. దీనిపై విహెచ్ లిఖితపూర్వకంగా పార్టీ అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేశారు.

Congress Suspend to Nagesh Mudiraj

The post కాంగ్రెస్ నుంచి నాగేశ్ ముదిరాజ్ సస్పెండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: