అందుకే టిఆర్‌ఎస్ పార్టీలో చేరాం: రేగ

  హైదరాబాద్: తాము కాంగ్రెస్ పార్టీని మానసికంగా విభేదించి టిఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని ఎంఎల్‌ఎ రేగా కాంతారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలలో కాంగ్రెస్ పార్టీతో విభేదించిన అనంతరం 12 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కలిసి సిఎం కెసిఆర్‌ను కలిశామని, టిఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తించాలని కోరామన్నారు. విలీనమైన తాము ఇంకా టిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని జడ్‌పి ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని, కాంగ్రెస్ నాయకులు అనవసరంగా […] The post అందుకే టిఆర్‌ఎస్ పార్టీలో చేరాం: రేగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: తాము కాంగ్రెస్ పార్టీని మానసికంగా విభేదించి టిఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని ఎంఎల్‌ఎ రేగా కాంతారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలలో కాంగ్రెస్ పార్టీతో విభేదించిన అనంతరం 12 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కలిసి సిఎం కెసిఆర్‌ను కలిశామని, టిఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తించాలని కోరామన్నారు. విలీనమైన తాము ఇంకా టిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని జడ్‌పి ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని, కాంగ్రెస్ నాయకులు అనవసరంగా తమ మీద విమర్శలు చేస్తున్నారని రేగ మండిపడ్డారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ని ఉపయోగించుకొని పార్టీ మారుతున్నామని, తాము కూడా కోర్టులను ఆశ్రయిస్తామని వివరించారు. తాము కాంగ్రెస్ నేతలపై పరువునష్టం దావా వేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన సభలో ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క జడ్పి పీఠాన్ని గెలుచుకోలేకపోయారని రేగ ఎద్దేవా చేశారు.

 

Congress Party Merge in TRS Party in Assembly: Rega

The post అందుకే టిఆర్‌ఎస్ పార్టీలో చేరాం: రేగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: