బిజెపిలో చేరిన కాంగ్రెస్ ఎంఎల్ఎలు

ఢిల్లీ : గోవాలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ కు చెందిన 10 మంది ఎంఎల్ఎలు గురువారం అధికార బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా, గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో వీరు బిజెపి  తీర్థం పుచ్చుకున్నారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో బిజెపి 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 15 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షంలో నిలిచింది. 10 మంది ఎంఎల్ఎలు […] The post బిజెపిలో చేరిన కాంగ్రెస్ ఎంఎల్ఎలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : గోవాలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ కు చెందిన 10 మంది ఎంఎల్ఎలు గురువారం అధికార బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా, గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో వీరు బిజెపి  తీర్థం పుచ్చుకున్నారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో బిజెపి 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 15 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షంలో నిలిచింది. 10 మంది ఎంఎల్ఎలు బిజెపిలో చేరడంతో కాంగ్రెస్ ఎంఎల్ఎల సంఖ్య 5కి పడిపోయింది. ఇప్పటికే కర్నాటక రాజకీయ సంంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ కు గోవాలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్నాటకం అయిపోయిన వెంటనే మధ్యప్రదేశ్, రాజస్థాన్ లపై బిజెపి దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్  స్వల్ప ఆధిక్యంతో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో సైతం రాజకీయ సంక్షోభం సృష్టించి, అధికారంలోకి రావాలని బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Congress MLAs Joining BJP In Goa

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిజెపిలో చేరిన కాంగ్రెస్ ఎంఎల్ఎలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: