ప్రభుత్వాధికారులను దూషించిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ (వీడియో)

వార్ధా : మహారాష్ట్రలోని ఓ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ యశోమతి ఠాకూర్ ప్రభుత్వాధికారులపై శివాలెత్తారు. వార్ధాలో ప్రభుత్వాధికారులతో స్థానిక ఎంఎల్‌ఎలు మంచినీటి సరఫరాపై సమావేశం ఏర్పాటు చేశారు. వార్దాకు మంచి నీళ్లు విడుదల చేయలేదని అధికారులపై అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. స్థానిక కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను కూడా అధికారులు లెక్కచేయడం లేదని మండిపడ్డారు. గత వారం రోజుల క్రితం వార్ధా ప్రాంతానికి మంచి నీటిని విడుదల చేయాలని స్థానిక ఆధికారులకు జిల్లా కలెక్టర్ జివొ విడుదల చేశారు. […] The post ప్రభుత్వాధికారులను దూషించిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వార్ధా : మహారాష్ట్రలోని ఓ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ యశోమతి ఠాకూర్ ప్రభుత్వాధికారులపై శివాలెత్తారు. వార్ధాలో ప్రభుత్వాధికారులతో స్థానిక ఎంఎల్‌ఎలు మంచినీటి సరఫరాపై సమావేశం ఏర్పాటు చేశారు. వార్దాకు మంచి నీళ్లు విడుదల చేయలేదని అధికారులపై అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. స్థానిక కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను కూడా అధికారులు లెక్కచేయడం లేదని మండిపడ్డారు. గత వారం రోజుల క్రితం వార్ధా ప్రాంతానికి మంచి నీటిని విడుదల చేయాలని స్థానిక ఆధికారులకు జిల్లా కలెక్టర్ జివొ విడుదల చేశారు. మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఉండటంతో తన తేయిసా నియోజకవర్గానికి నీళ్లు రాకుండా బిజెపి నాయకులు అడ్డుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. బిజెపి ఎంఎల్‌ఎ కావాలనే తన నియోజకవర్గానికి నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. నీళ్ల విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదని సదురు బిజెపి ఎంఎల్‌ఎకు సూచించారు. అన్యాయంగా ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని, రాజకీయ డ్రామాలాడొద్దని బిజెపి నాయకులను హెచ్చరించారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న విషయం తెలిసిందే.

 

Congress MLA Yashomati Thakur Abuses Public Officials

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రభుత్వాధికారులను దూషించిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎ (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: