ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన

రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఎయిర్ ఇండియా మహిళా ఉద్యోగిని పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహాసముంద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వినోద్ చంద్రాకర్ ఆగస్టు 7న రాయ్ పూర్ విమానాశ్రయానికి ఆలస్యంగా రావడమే కాకుండా తనను విమానంలోకి అనుమతించనందుకు తమ సంస్థ ఉద్యోగినిపై అసభ్యంగా ప్రవర్తించడంపై ఎయిర్ ఇండియా విచారణ జరుపుతోంది. రాయ్ పూర్ నుంచి రాంచికి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరాల్సి ఉండగా ఎమ్మెల్యే […] The post ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఎయిర్ ఇండియా మహిళా ఉద్యోగిని పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహాసముంద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వినోద్ చంద్రాకర్ ఆగస్టు 7న రాయ్ పూర్ విమానాశ్రయానికి ఆలస్యంగా రావడమే కాకుండా తనను విమానంలోకి అనుమతించనందుకు తమ సంస్థ ఉద్యోగినిపై అసభ్యంగా ప్రవర్తించడంపై ఎయిర్ ఇండియా విచారణ జరుపుతోంది. రాయ్ పూర్ నుంచి రాంచికి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరాల్సి ఉండగా ఎమ్మెల్యే బోర్డింగ్ కార్డును 5.36 గంటలకు ముందుగానే తీసుకున్నారు. ప్రయాణికులందరూ సకాలంలో వచ్చేసినా ఐదుగురు మాత్రం పదేపదే అనౌన్స్‌మెంట్లు చేసినప్పటికీ చేరుకోవలేదు. 6.12 గంటల దాకా అనౌన్స్‌మెంట్లు చేసిన తర్వాత విమానం 6.30 గంటలకు బయల్దేరి వెళ్లిపోయింది.

అయితే విమానం బయల్దేరడానికి కొద్ది నిమిషాల ముందు తన సహాయకులతో విమానాశ్రయం చేరుకున్న ఎమ్మెల్యేను అందులో ఎక్కడానికి అనుమతించకపోవడంతో ఎయిర్ ఇండియా ఉద్యోగినితో ఆయన గొడవ పెట్టుకున్నారు. ఆమె గుర్తింపు కార్డును, సెల్‌ఫోన్‌ను లాక్కుని అందులో నుంచే ఎయిర్‌పోర్ట్ స్ఠేషన్ మేనేజర్‌తో మాట్లాడారు. ఆ తర్వాత ఆమె సెల్‌ఫోన్ ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకున్నారు. దీంతో భయపడిపోయిన ఆ ఉద్యోగిని సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది సాయంతో ఎయిర్‌పోర్ట్ వెనుక గేటు ద్వారా దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వర్షంలో నడుచుకుంటూ వెళ్లారని ఎయిర్ ఇండియా తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఆ మహిళా ఉద్యోగి నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని, ఈ సంఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ మాత్రం తాను ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. తాను సరైన సమయానికే ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినా తనను విమానం ఎక్కనివ్వలేదని ఆయన చెబుతున్నారు. పైగా ఆ మహిళా ఉద్యోగే తనను నానా దుర్భాషలాడిందంటూ ఆయన ఆరోపించారు.

Congress MLA misbehaves with female Air India staff after he misses flight
The boarding card of the MLA was taken out in advance at 17:36 hours. All the passengers were boarded except five passengers.

The post ఎయిర్ ఇండియా ఉద్యోగినిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: