గడ్కరీ ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళన

ఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త మోటారు వాహనాల చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ కాంగ్రెస్ యూత్ విభాగం ఆద్వర్యంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంటి ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు. సామాన్యులపై పెనుభారం వేసేలా ఉన్న మోటార్ వెహికిల్ యాక్ట్ -2019ను తక్షణమే రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ వ్యవహారంపై మంత్రి […] The post గడ్కరీ ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త మోటారు వాహనాల చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ కాంగ్రెస్ యూత్ విభాగం ఆద్వర్యంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంటి ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు. సామాన్యులపై పెనుభారం వేసేలా ఉన్న మోటార్ వెహికిల్ యాక్ట్ -2019ను తక్షణమే రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

ఈ వ్యవహారంపై మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ జరిమానా ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదని గడ్కరీ స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల దేశంలో ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటే ప్రజలు భయపడి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలు కూడా ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ఆయన తేల్చి చెప్పారు. 

Congress Leaders Protest In Front of Nitin Gadkari House

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గడ్కరీ ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: