టిఆర్ఎస్ లో భారీగా చేరికలు

దౌల్తాబాద్ (రంగారెడ్డి): టిఆర్ఎస్ ప్రభుత్వ జనరంజక పాలన తోనే రాష్ట్రంలో గ్రామాల అభివృద్ది సాధ్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం  మండల పరిధిలోని అంతారం గ్రామ సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిటిసి లక్ష్మి, ఉపసర్పంచ్ ఆనంద్ లతో పాటు గ్రామాంలోని పది వార్డులకు చెందిన వార్డు మెంబర్లులతో పాటు సుమారు 400 మంది గ్రామస్తులు కాంగ్రేస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటు మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు […] The post టిఆర్ఎస్ లో భారీగా చేరికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దౌల్తాబాద్ (రంగారెడ్డి): టిఆర్ఎస్ ప్రభుత్వ జనరంజక పాలన తోనే రాష్ట్రంలో గ్రామాల అభివృద్ది సాధ్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం  మండల పరిధిలోని అంతారం గ్రామ సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపిటిసి లక్ష్మి, ఉపసర్పంచ్ ఆనంద్ లతో పాటు గ్రామాంలోని పది వార్డులకు చెందిన వార్డు మెంబర్లులతో పాటు సుమారు 400 మంది గ్రామస్తులు కాంగ్రేస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటు మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రేస్ కార్యర్తలు  నరేందర్‌రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రేస్ పార్టీని వీడి తెరాసా పార్టీలో చేరిన వారికి నరేందర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సర్పంచులు, ఎంపిటిసిలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వం లోని తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందజేస్తుందని ఆయన చెప్పారు. గ్రామాల అభివృద్ది ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమని ఆయన తెలిపారు. దౌల్తాబాద్ మండలం అభివృద్దిలో వెనుకబాటుకు గురైందని, మండలానికి సాగునీరు తీసుకువచ్చి కరువును పారదోలడానికి తనవంతు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా గ్రామాలలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రజలు  టిఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా  కోసం పార్లమెంటులో పోరాడేందుకు, కేంద్రం మెడలు వంచి జాతీయ హోదాను తీసుకురావడానికి ప్రస్తుతం టిఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న పార్లమెంటు అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మహాబూబ్‌నగర్ పార్లమెంటు అభ్యర్థిగా టిఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి మన్నెశ్రీనివాస్‌రెడ్డిని బారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
సంక్షేమ పథకాలు నచ్చి టిఆర్ఎస్ లోకి …
కాంగ్రేస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరిన సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై కాంగ్రేస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరినట్టు తెలిపారు. సిఎం కెసిఆర్ చలవతో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో  తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసుకోవడమే తమ లక్ష్యమని  ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడంగల్ ఎంపిపి ముద్దప్పదేశ్‌ముఖ్, మండల మాజీ జడ్‌పిటిసి మోహన్‌రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రమోద్‌రావ్, నాయకులు మహిపాల్‌రెడ్డి, నర్వోత్తంరెడ్డి,నీలారెడ్డి, వెంకట్‌రెడ్డి, పకీరప్ప, నర్వోత్తంరెడ్డి, బసంత్‌రెడ్డి, రాజు,మైనోద్దీన్, భీములు,టిఆర్‌యస్వీ జిల్లా కోఆర్డినేటర్ కోట్ల మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Congress Leaders joins TRS

The post టిఆర్ఎస్ లో భారీగా చేరికలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: