కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి…

కొందుర్గు (రంగారెడ్డి) : టిఆర్ఎస్  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఇతర పార్టీలకు చెందిన నేతలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని  ఆ పార్టీ  మండల అధ్యక్షుడు రాజేష్ పటేల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియార్ నాయకులు బ్యాగరి రాజు , కుమార్ , సుదాకర్ ,సుందరయ్య నర్సింలు ,కృష్ణయ్య ,మదుకర్ , రమేష్ , పవన్ ,శ్రీకాంత్ ,చందు , […] The post కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కొందుర్గు (రంగారెడ్డి) : టిఆర్ఎస్  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఇతర పార్టీలకు చెందిన నేతలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని  ఆ పార్టీ  మండల అధ్యక్షుడు రాజేష్ పటేల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియార్ నాయకులు బ్యాగరి రాజు , కుమార్ , సుదాకర్ ,సుందరయ్య నర్సింలు ,కృష్ణయ్య ,మదుకర్ , రమేష్ , పవన్ ,శ్రీకాంత్ ,చందు , శ్రీకాంత్ లు గులాబీ కండువా కప్పుకొని టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా రాజేష్  మాట్లాడారు. గత 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల అభివృద్ది కోసం ఏన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, వారికి బాసటగా నిలిచిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ ,నిరంజన్ .పెంటయ్య ,మానయ్య ,బాల్‌రాజు ,నర్సింలు గౌడ్ , శేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Congress Leaders Joins TRS at Kondurg in Rangareddy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: