కుమార బలపరీక్ష గురువారం

Karnataka Political

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీలో కుమారస్వామి నాయకత్వపు జెడిఎస్ కాంగ్రెస్ సంకీర్ణానికి ఈ నెల 18వ తేదీన విశ్వాస పరీక్ష జరుగుతుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టే విశ్వాస తీర్మానంపై వచ్చే గురువారం ఉదయం ఓటింగ్ జరుగుతుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ సోమవారం తెలిపారు. దీనితో సుదీర్ఘ కర్నాటక సంక్షోభం అటో ఇటో తేలుతుందా? మరింత బిగుసుకుంటుందా? అనేది వెల్లడి కానుంది. తాను సోమవారమే (15వ తేదీనే) సభలో బలపరీక్షకు సిద్ధం అని గత వారం కుమారస్వామి తెలిపారు. అయితే స్పీకర్ రమేష్ కుమార్ ప్రతిపక్ష, సంకీర్ణ నేతలతో సభా కార్యక్రమాల నిర్వహణ కమిటి సమావేశంలో చర్చించి బలపరీక్ష తేదీని ఖరారు చేశారు. దీనిని అసెంబ్లీలోనే సోమవారం ప్రకటించారు. గురువారం వరకూ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

సభా నాయకుడు అయిన సిఎం సభలో గురువారం విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతారని , దీనిపై చర్చకు అవకాశం ఉందనిస్పీకర్ వివరించారు. ఇరు పక్షాలను సంప్రదించిన తరువాత వారి అంగీకారం మేరకు బలపరీక్ష తేదీని ఖరారు చేసినట్లు స్పీకర్ విలేకరులకు కూడా చెప్పారు. ఈ దశలోనే అసెంబ్లీ ఆవరణలో సిఎల్‌పి నేత సిద్ధరామయ్య కూడా బలపరీక్షకు అంతా అంగీకరించిన విషయాన్ని వెల్లడించారు. బిఎసిలో అంతా ఖరారు అయిందని చెప్పారు. బిజెపి సీనియర్ నేత జెసిమధుస్వామి కూడా బలపరీక్ష తేదీకి తాము ఆమోదం తెలిపినట్లు ధృవీకరించారు. అయితే అంతకు ముందు అసెంబ్లీలోనే తాము సిఎం కుమారస్వామికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు బిజెపి వారు స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. బిఎసిలోనే పార్టీ నేత యడ్యూరప్ప ఈ నోటీసుఅందించారని వివరించారు.
నేడు రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం విచారణ
కర్నాటక సంక్షోభంపై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం (నేడు) కీలక విచారణను పునఃప్రారంభిస్తుంది. మరో ఐదుగురు అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నిర్ణయానికి ఆదేశించాలని సుప్రీంను అభ్యర్థించా రు. దీనితో మొత్తం 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదమా? వారిపై అనర్హత వేటా? అనే అత్యంత కీలకమైన రాజ్యాంగ అంశాన్ని పరిశీలించి తగు రూలింగ్‌ను సుప్రీం మంగళవారం వెలువరించేందుకు వీలుంది. అన్ని పిటిషన్లను కలిపి సరైన రూలింగ్ ఇచ్చేక్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపడుతుంది. స్పీకర్ అధికారా ల పరిమితికి లోబడి వ్యవహరిస్తున్నారా? ఇందులో ఇమి డి ఉన్న రాజ్యాంగ అంశాలు కీలకంగా మారాయి.

Congress leaders hold meeting in Bengaluru

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కుమార బలపరీక్ష గురువారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.