ముట్టడిపై చేతిలో చిచ్చు

  రేవంత్ ఎవరిని అడిగి చేపట్టారు ఉత్తమ్ ఇతర నేతలకు సమాచారం ఎందుకివ్వలేదు? భట్టి ఎదుట సీనియర్ నేతల గుస్సా హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి ఎవరిని అడిగి ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సిఎల్‌పి సమావేశంలో ప్రశ్నించారు. ఆర్‌టిసి కార్మికుల కు మద్దతుగా సోమవారం కొందరు కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రగతిభవన్ ముట్టడిపై ఆ పార్టీలో భిన్నవాదనలు వెలువడ్డా యి. మంగళవారం సిఎల్‌పి కార్యాలయ ంలో జరిగిన సమావేశంలో ఇదే అంశం చర్చకు […] The post ముట్టడిపై చేతిలో చిచ్చు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రేవంత్ ఎవరిని అడిగి చేపట్టారు
ఉత్తమ్ ఇతర నేతలకు సమాచారం ఎందుకివ్వలేదు?
భట్టి ఎదుట సీనియర్ నేతల గుస్సా

హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి ఎవరిని అడిగి ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సిఎల్‌పి సమావేశంలో ప్రశ్నించారు. ఆర్‌టిసి కార్మికుల కు మద్దతుగా సోమవారం కొందరు కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రగతిభవన్ ముట్టడిపై ఆ పార్టీలో భిన్నవాదనలు వెలువడ్డా యి. మంగళవారం సిఎల్‌పి కార్యాలయ ంలో జరిగిన సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కతో ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, విహెచ్ హనుమంతరావు, కోదండరెడ్డి హాజరయ్యారు. అస లు ప్రగతిభవన్ ముట్టడి వ్యవహారంపై నే తలు ఎవ్వరికీ సమాచారం లేదని కాం గ్రెస్ పార్టీ సీనియర్లు మండిపడుతున్నా రు. ప్రగతిభవన్ ముట్టడిపై పిసిసి అధ్యక్షు డు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేయడాన్ని వారు తప్పుబట్టారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని భట్టి విక్రమార్కకు నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలనే అంశంపై సమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. ఎవరికివారు ఇష్టరీతిలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదని.. పార్టీ నియమనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల మాటలతో పార్టీలో చీలకలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేక పార్టీ శ్రేణులు అభద్రతాభావంలో ఉన్నారు.

కొత్తగా పార్టీలోకి వచ్చి దుందూకుడు వ్యవహారాలు సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదు. ఎన్నోయేళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకుని పాకులాడుతున్న నాయకులకు కనీస గౌరవం ఇవ్వకపోవడం ఆవేదనకు గురి చేస్తుందని ఓ సీనియర్ నేత సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. తామే పార్టీకి దిక్కు అన్నట్లుగా కొంతమంది వ్యహరిస్తున్నారని, పార్టీ తరపున కార్యక్రమాలు రూపొందించేటప్పుడు, నిర్వహించేటప్పుడు చెప్పడం, అభిప్రాయం అడగడం చేయకపోవడం దారుణమని అనుకుంటున్నారు.

Congress leaders angry over Revant Reddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముట్టడిపై చేతిలో చిచ్చు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: