‘హద్దు’ మీరారు…!

  వార్డుల పునర్ విభజనపై వెల్లువెత్తిన ఫిర్యాదులు నిబంధనలు విస్మరించిన అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆశావహులు, ప్రజలు మెజార్టీ మున్సిపాలిటీల్లో వెల్లువెత్తిన ఫిర్యాదులు నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పురపాలక సంఘాల వార్డుల పునర్విభజన ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ప్రభుత్వం తగిన సమయం ఇచ్చినప్పటికీ అధికార యంత్రాంగం చేసిన హడావుడి సాంకేతికపరమైన అంశాలతో జాబితా కాస్త గజి బిజిగా మారేందుకు కారణభూతమైంది. రాజకీయ ప్రోద్బలంతో పాటు ఇష్టమైన వారి సూచనలతో ఇష్టారీతిన వార్డుల […] The post ‘హద్దు’ మీరారు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వార్డుల పునర్ విభజనపై వెల్లువెత్తిన ఫిర్యాదులు
నిబంధనలు విస్మరించిన అధికారులు, సిబ్బంది
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆశావహులు, ప్రజలు
మెజార్టీ మున్సిపాలిటీల్లో వెల్లువెత్తిన ఫిర్యాదులు

నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పురపాలక సంఘాల వార్డుల పునర్విభజన ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ప్రభుత్వం తగిన సమయం ఇచ్చినప్పటికీ అధికార యంత్రాంగం చేసిన హడావుడి సాంకేతికపరమైన అంశాలతో జాబితా కాస్త గజి బిజిగా మారేందుకు కారణభూతమైంది. రాజకీయ ప్రోద్బలంతో పాటు ఇష్టమైన వారి సూచనలతో ఇష్టారీతిన వార్డుల పునర్ విభజన ప్రక్రియ చేపట్టడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మెజార్టీ పురపాలక సంఘాల్లో అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి మూడు జిల్లాల పరిధిలోని 19మున్సిపాలిటీ లల్లో వార్డుల పునర్విభజన గందరగోళంపై ఆశావహుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తా యి. ఒకే క్రమసంఖ్య ఇంటి నెంబర్లను రెండు వార్డుల్లో కలప డంతో అవి ఏ కాలనీలకు చెంది తాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో స్థానికులు, పోటీ చేయాల్సి న ఆశావహులు తలలు బాదుకుంటున్నారు. 19 పురపాలక సంఘాల్లో కెల్లా మెజార్టీ మున్సిపాలిటీల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ ప్రక్రియ చేప ట్టకపోవడం కారణంగానే సమస్యలు తలెత్తినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయనే చర్చ తీవ్రంగా జరుగుతోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాత, కొత్త కలిపి మొత్తంగా 19 మున్సిపాలిటీలు మనుగడలో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, చిట్యాల, హాలియా, చండూరు, నకిరేకల్ మున్సిపాలిటీలు, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరెడుచర్ల ఉండగా, యాదా ద్రిభువనగిరి జిల్లాలో భువనగిరి, మోత్కూరు, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి యాదగిరిగుట్టలు పురపాలక సంఘాలుగా ఉన్నాయి. దాదాపు అన్ని పురపాలక సంఘాల్లో వార్డుల పునర్వభజనలో భాగంగా పలు వార్డుల ను పెంచాలంటూ పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేశారు.

అయితే మే 22 నుంచి 30వ తేదీ వరకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి మహిళా ఓటర్ల కుల గణన చేపట్టారు. గణన పూర్తయిన రోజు నుంచే వార్డుల పునర్విభజన చేయాలని ప్రభుత్వం స్పష్టంచేయడంతో రెండురోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి 2వ తేదీ జాబితా వెల్లడించాలని స్పష్టంచేసింది. దీంతో అధికారులు పురపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక వి భాగం అధికారులు, బిల్ కలెక్టర్లకు బాధ్యతలును అప్పగించారు. వీరు క్షేత్రస్థాయిలో కాలనీల్లో పర్యటించి వార్డుల వారీగా హద్దులు నిర్ణయించడం, ఓటర్ల వా రీగా పునర్విభజన చేయట్టాల్సి ఉంటుంది. శాశ్వత నిర్మాణాలైన రోడ్డు, రైల్యేపట్టాలు, చెర్వులు తదితర వాటిని పరిగణంలోకి తీసుకోవాల్సి ఉం టుంది. విభజన ప్రక్రియ సందర్భంగా ఇవి అడ్టుగా వస్తే అక్కడికే నిలిపివేయాల్సి ఉంటుంది. ఒక్కో వార్డులో 2200 నుంచి 2700 వరకు జనాభాతో ఒక వార్డుగా విభజంచినప్పటికి నిబంధనలు మాత్రం తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది.

ఒక వార్డులో ఓటర్లను కలపాల్సి వస్తే సమీపంలో ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది, కానీ వాటికి దూరంగా ఉన్న వాటిని కలిపేశారు. అధికారులు కార్యాలయంలో ముం దుగా రూపొందించిన మ్యాప్‌లను పరిశీలించడం ఇంటి నెంబర్ల వారీ గా ఓటరు జాబితాలను తీసుకొని వార్డులను ఏర్పాటుచేశారు. నిబందనలు పాటించాలంటూ ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినా అధికారులు, సి బ్బంది మాత్రం హడావుడిగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఇటీవల అన్ని మున్సిపాలిటీల్లో అందిన ఫిర్యాదుల మేరకు తెలుస్తోంది. దీంతో వార్డు ల పునర్విభజన జాబితా గజిబిజిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాతనే ఈ ప్రక్రియ చేపట్టామని ధీమాగా చెబుతున్నారు.

కోకొల్లలుగా ఫిర్యాదులు… పురపాలిక సంఘాల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ గందరగోళంగా మారడంతో ప్రజలతో పాటు ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఇలా ఉండటం మూ లంగా పూర్తి గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని ఆయా కాలనీవాసులకు కూడా తాము ఏ వార్డు పరిధిలోకి వస్తామో తెలియని పరిస్థితి ఉంటుందని ఆవేదన ఆశావహులు, రాజకీయ పార్టీలు అందించిన ఫి ర్యాదుల్లో వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్డుల విభజన ప్రక్రియ గందరగోళంగా ఉందని అధికార యంత్రాంగం తప్పిదాలను ఎత్తిచూపుతూ పలువురు ఫిర్యాదులు వెల్లువలా అధికారుల చెంత వచ్చిపడ్డాయి. రాజకీయ పార్టీలతో పాటు పలువురు పట్టణవాసులు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారు పునర్విభజన ప్రక్రియపై ఫిర్యాదులు విరివిగా అందజేశాయి.

ఇదే విషయమై పురపాలక సంఘం అధికారిని ‘మన తెలంగాణ’ వివరణ కోరగా పునర్విభజన జాబితా వెల్లడించామని వాటి లో అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈనెల 5వ తేదీ వరకు గడువు విధించగా చాలా మంది నుంచి ఫిర్యాదులు అందాయని, వాటి ని క్షుణ్ణంగా పరిశీలించి అన్నింటిని అభ్యంతరాలను పరిష్కరిస్తామని పేర్కొంటున్నారు. అయితే ఈనెల 1వ తేదీ సోమవారం వరకు పునర్విభజన కసరత్తు పూర్తి చేసి 2వ తేదీ మంగళవారం ముసాయిదా జాబితాలు వెల్లడించారు.

దీంతో పట్టణ ముఖచిత్రాలు సంపూర్ణంగా మారిపోయాయి. కాగా సదరు ముసాయిదాపై అభ్యంతరాలకు ఈనెల 5వ తేదీ తు దిగడువు విధించడంతో పునిర్వభజనపై ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్యా. మార్పులు, చేర్పులకు ప్రత్యేకాధికారులు ఆమోదంతో ఈ నెల 7వ తేదీ ఆదివారం తుదిజాబితాలు వెల్లడించే అవకాశం ఉంది. వా ర్డుల పునర్విభజన అనంతరం పోలింగ్ బూత్‌ల వారిగా వార్డులను అ నుసరించి వాటి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Confusion in Division of Municipal Wards

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ‘హద్దు’ మీరారు…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.