ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై జిహెచ్ఎంసి కమిషనర్ సమీక్ష

Lokesh Kumar

 

హైదరాబాద్: జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై  సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రస్తుత స్థితి టౌన్ ప్లానింగ్ విభాగంలో పెండింగ్ కేసుల అంశాలపై చర్చించారు. నగరంలో భూక్రమబద్ధీకరణ పథకం దరఖాస్తుల పరిష్కారానికి నవంబర్ 30వ తేదీన అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక మేళా నిర్వహిస్తామన్నారు. 2016 డిసెంబర్ 31 నాటికి ముందు స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తామని లోకేష్ కుమార్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 85,291 దరఖాస్తులు అందగా  28,935లకు ఎల్ఆర్ఎస్ ప్రొసిడింగ్ లు జారీచేశామన్నారు. 20,425 దరఖాస్తులను తిరస్కరించగా, మరో 25,726 దరఖాస్తులకు కావాల్సిన పత్రాలను జతపర్చాలని సమాచారం అందించినట్టు ఆయన వెల్లడించారు.

Commissioner Lokesh Kumar review on LRS applications

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై జిహెచ్ఎంసి కమిషనర్ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.