నిజామాబాధ…

Nizamabad

 

మంగళవారం సాయంత్రం గంటన్నర పాటు కురిసిన వర్షంతో కాలనీలన్నీ జలమయం, ఇళ్లల్లోకి నీరు

నిజామాబాద్ : మంగళవారం సాయంత్రం 4.30 గంటల నుండి 6 గంటల వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పలు కాలనీలైన కోటగల్లి, చంద్రశేఖర్‌కాలనీ, దుబ్బ తదితర కాలనీల్లో నివసించే ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఇండ్లలోని మహిళలు నీటిని తొలగించలేక తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అలాగే నగరంలో భూగర్భ మురుగు కాలువలు, రోడ్డు పనులు జరుగుతండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

దీనికితోడు వర్షాకాలం ఆరంభమవడంతో రోడ్ల న్నీ బురదమయమై నడవలేని పరిస్థితి నెలకొని పూసలగల్లిలో బస్సు గుంతలో దిగింది. మురికికాలువలు శుభ్రం చేయకపోవడంతో రోడ్ల పై పేరుకుపోయి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తుగా ప్రధాన డ్రైనేజీల్లో పూడికతీత చేపట్టకపోవడంతో ప్రధాన రోడ్లన్నీ మురికికూపంగా మారాయి. తవ్వకాలు చేపట్టి గుంతలను పూడ్చడంలో జాప్యం చేయడంతో ఆ గుంతలన్నీ జలమయమయ్యాయి.

వాహనాల రాకపోకలతో బురదనీరు పాదచారులపై పడడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో భారీ వాహనాలు బురదలో చిక్కుకుపోయి ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. పులాంగ్ రోడ్డు నుండి గోల్‌హన్మాన్, సిర్నాపల్లి గడి, కటికెగల్లి, దేవిథియేటర్ చౌరస్తా నుండి బ్రిడ్జి వరకు, అలాగే విక్లిమార్కెట్, దేవిమందిర్, పూసలగల్లి, అహ్మదిబజార్ వరకు తవ్వకాలు కొనసాగుతుండడంతో రోడ్లన్నీ బురదమయమై చిత్తడిగా దర్శనమిచ్చాయి. అనేక ద్విచక్ర వాహనదారులు వాహనాలు అదుపుతప్పి నేలపై పడ్డారు. ఈ రోడ్ల పరిస్థితిపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Colonies were submerged in water in Nizamabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిజామాబాధ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.