సబ్‌స్టేషన్ల భూములను పరిశీలించిన కలెక్టర్…

సుబేదారి: ప్రజోపయోగ పనుల నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయాశాఖలపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జెపాటిల్ తెలిపారు. అమ్మవారిపేట నందు రూ.66 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ నిర్మించనున్న 220 కెవి సబ్‌స్టేషన్ పనులకు కేటాయించిన భూమిని సంబంధిత అధికారులతో కలిసి శనివారం  కలెక్టర్ పరిశీలించారు. వేగంగా విస్తరిస్తున్న నగర ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భూమికి ప్రహరి […] The post సబ్‌స్టేషన్ల భూములను పరిశీలించిన కలెక్టర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సుబేదారి: ప్రజోపయోగ పనుల నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయాశాఖలపై ఉందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జెపాటిల్ తెలిపారు. అమ్మవారిపేట నందు రూ.66 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ నిర్మించనున్న 220 కెవి సబ్‌స్టేషన్ పనులకు కేటాయించిన భూమిని సంబంధిత అధికారులతో కలిసి శనివారం  కలెక్టర్ పరిశీలించారు. వేగంగా విస్తరిస్తున్న నగర ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భూమికి ప్రహరి గోడను వెంటనే నిర్మించుకోవాలని ఆదేశించారు. మట్టి తవ్వకానికి తీసిన గోతులను నింపుకొని వినియోగించుకోవాలని చెప్పారు. ఎందుకు పనికిరాని భూములను మాత్రమే ఇటువంటి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. అన్నిరకాలుగా అనువైన భూములను ఇతర అవసరాలకు ఉపయోగించనున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో ఆర్‌డిఒ కె.వెంకారెడ్డి, తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, విద్యుత్‌శాఖాధికారులు పాల్గొన్నారు.

 

Collector who examined the substations lands

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సబ్‌స్టేషన్ల భూములను పరిశీలించిన కలెక్టర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: