అపెరల్ పార్క్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

  రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో తమిళనాడులోని వస్త్ర ఉత్పత్తి కేంద్రం తిరుపూర్ మాదిరిగా అపెరల్ పార్క్‌ను నిర్మించాలని, అందుకోసం అధికారులు, ఇంజనీర్ల బృందం తిరుపూర్ అధ్యయనానికి వెళ్లి రావాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. సిరిసిల్లలో అపెరల్ పార్క్ నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… తిరుపూర్‌లో అత్యుత్తమంగా ఉన్న నిర్మాణాల నమూనాతో సిరిసిల్లలో నిర్మాణాలు చేపట్టాలన్నారు. అపెరల్ పార్క్ అవసరాల కోసం మిషన్ భగీరథ నీటిని అందిస్తామని, ఆరు మాసాల్లోగా […] The post అపెరల్ పార్క్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో తమిళనాడులోని వస్త్ర ఉత్పత్తి కేంద్రం తిరుపూర్ మాదిరిగా అపెరల్ పార్క్‌ను నిర్మించాలని, అందుకోసం అధికారులు, ఇంజనీర్ల బృందం తిరుపూర్ అధ్యయనానికి వెళ్లి రావాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి అన్నారు. సిరిసిల్లలో అపెరల్ పార్క్ నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… తిరుపూర్‌లో అత్యుత్తమంగా ఉన్న నిర్మాణాల నమూనాతో సిరిసిల్లలో నిర్మాణాలు చేపట్టాలన్నారు. అపెరల్ పార్క్ అవసరాల కోసం మిషన్ భగీరథ నీటిని అందిస్తామని, ఆరు మాసాల్లోగా కార్మికులను యజమానులుగా మార్చే పథకం వర్కర్‌ టూ ఓనర్ స్కీం షెడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. 60 ఎకరాల్లో నిర్మిస్తున్న అపెరల్ పార్క్, 88 ఎకరాల్లో నిర్మిస్తున్న వీవింగ్ పార్క్ నిర్మాణ పనులను పరిశీలించి మే 15వ తేదీ కల్లా షెడ్లు ఇతర పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసి యాస్మిన్ భాష, ఆర్‌డిఒ శ్రీనివాసరావు, చేనేత జౌళిశాఖ అధికారులు పాల్గొన్నారు.

collector examined the Apparel Park construction site

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అపెరల్ పార్క్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: