బాధిత విద్యార్థినికి కలెక్టర్ భరోసా

  ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తాం జిల్లా కలెక్టర్ హన్మంతరావు హత్నూర : మండలంలోని కొన్యాల గ్రామంలో పొలం వద్ద కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన పత్తి మల్లయ్య, నర్సమ్మ దంపతుల పిల్లలను జిల్లా కలెక్టర్ హన్మంతరావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డిలు శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటి పెద్ద దిక్కు అయిన అమ్మానాన్నలు చనిపోయి ముగ్గురు పిల్లలు ఒంటరి కావడం బాధాకరమన్నారు. వారి పిల్లలకు తీరనిలోటని ముగ్గురు పిల్లల్ని […] The post బాధిత విద్యార్థినికి కలెక్టర్ భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తాం
జిల్లా కలెక్టర్ హన్మంతరావు

హత్నూర : మండలంలోని కొన్యాల గ్రామంలో పొలం వద్ద కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన పత్తి మల్లయ్య, నర్సమ్మ దంపతుల పిల్లలను జిల్లా కలెక్టర్ హన్మంతరావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలకా్ష్మరెడ్డిలు శుక్రవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటి పెద్ద దిక్కు అయిన అమ్మానాన్నలు చనిపోయి ముగ్గురు పిల్లలు ఒంటరి కావడం బాధాకరమన్నారు. వారి పిల్లలకు తీరనిలోటని ముగ్గురు పిల్లల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. పిల్లల విషయమై మంత్రి హరీష్‌రావు స్పందించారని వారి పోషణ, చదువు బాధ్యతలను ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నట్లు తెలిపారు. కలెక్టర్ తన వంతు సహాయంగా పది వేల రూపాయల నగదును పిల్లలకు అందజేసి ధైర్యంగా ఉండాలని చెప్పాడు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సింలు, జెడ్పీటీసీ ఆంజనేయులు, తహశీల్దార్ జయరాం, ఎంపిడివో ప్రమీల నాయక్, ఎంపిటీసీలు విఠల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నర్సింహా రెడ్డి, సత్యంలు తదితరులు పాల్గొన్నారు.

Collector Assure to the affected Student

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాధిత విద్యార్థినికి కలెక్టర్ భరోసా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: