ఆరోగ్యానికి అండ.. కొబ్బరి బోండా

హుజూరాబాద్ రూరల్ (కరీంనగర్) : భానుడు నిప్పులు కక్కుతుంటే ప్రజలు భయంధోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టాలంటే గడగడలాడుతున్నారు. కొద్ది దూరం కూడా తమ ప్రయాణం సాగకముందే నోరంత ఎండిపోయి తడి ఆరిపోయి దాహమంటూ చల్లని తాగునీటి కోసం పరితపిస్తున్నారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు తమ ఆరోగ్య రీత్యా శీతలపానీయాల జోలికి వెళ్లకుండా అందుబాటులో ఉన్న కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తు సేద తిరుతున్నారు. కొబ్బరి బోండం దాహం తీర్చుకోవడానికి మాత్రమే ఉపకరించే  ద్రవం […] The post ఆరోగ్యానికి అండ.. కొబ్బరి బోండా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హుజూరాబాద్ రూరల్ (కరీంనగర్) : భానుడు నిప్పులు కక్కుతుంటే ప్రజలు భయంధోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టాలంటే గడగడలాడుతున్నారు. కొద్ది దూరం కూడా తమ ప్రయాణం సాగకముందే నోరంత ఎండిపోయి తడి ఆరిపోయి దాహమంటూ చల్లని తాగునీటి కోసం పరితపిస్తున్నారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు తమ ఆరోగ్య రీత్యా శీతలపానీయాల జోలికి వెళ్లకుండా అందుబాటులో ఉన్న కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తు సేద తిరుతున్నారు.
కొబ్బరి బోండం దాహం తీర్చుకోవడానికి మాత్రమే ఉపకరించే  ద్రవం అనుకుంటే పొరపాటే. శతాబ్ధాలు గడిచిన నాగరికత వింత పుంతలు తొక్కినా కొబ్బరి బోండం సగటు జీవికి అక్షరాల ఆరోగ్య సంజీవిని. నిత్య నూతన సాంకేతికి విప్లవాలు వస్తున్న రోజుల్లో వివిధ రకాల రసాయనాలు, విషపు రుచులతో వస్తున్న వివిధ రకాల పానియాలకు దీటైనదిగా కొబ్బరి బోండం తన స్థానాన్ని నిలుపుకుంటుంది. అంతే కాకుండా సేవించడానికే కాకుండా వివిధ రకాల శుభకార్యాలకు, అభిషేకాలకు కొబ్బరి బోండం తప్పకుండా ఉండాల్సిందే. ప్రపంచంలో ప్రతి దానిని కలుషితం చేస్తున్నా ఎప్పటి వరకు కొబ్బరి నీటిని చేయాలేదంటే అతియోశక్తి కాదు.
కొబ్బరి బోండం ఆరోగ్య పరంగా ఉపకరించే సకల ఔషధాల గని. ఆరోగ్య సంజీవినిగా ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరి బోండం నీళ్లలో విలువైన పోషకాలు ఎన్నో రకాల విటమిన్లు అందిస్తూ రోగులకు ఆరోగ్య ప్రదాయినిగా విలసిల్లుతుంది. నేరుగా ఆహారం తీసుకోలేని పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి వైద్యులు సరాసరిగా కొబ్బరి నీళ్లు తాగించమని సూచిస్తుండడం మనమంత గమనిస్తునే ఉంటాం. ప్రకృతితో పెనవేసుకొని కలుషితం చేయని, క్రిములు లేని పానియం కొబ్బరి నీళ్లు. ఇది రోగాల పాలిటా అద్భుతమైన టానిక్‌గా పనిచేస్తుంది. ఎండలో నీరస పడిన గ్లూకోజ్ స్థాయి తగ్గిన కొబ్బరి బోండం తాగితే ఉంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి బోండం నీళ్లను పిల్లలు తాగడం వల్లన మానసిక శారీరక ఎదుగుదల, మూత్ర పిండాలు సాఫీగా పనిచేసేందుకు ఎంతో సహకరించడమే కాకుండా గుండెకు బలాన్ని కూడా చేకురుస్తుంది. వాంతులు, విరోచనాలను అదుపు చేస్తుంది. పచ్చ కామెర్లకు ఔషధంగా పనిచేస్తుంది. వడదెబ్బను నివారించడమే కాకుండా శరీరంలో వేడి తీవ్రతను తగ్గించి చల్లదాననికి తోడ్పడుతుంది.

Coconut Water For Health

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆరోగ్యానికి అండ.. కొబ్బరి బోండా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.