ఏడాదికి రవిశాస్త్రి జీతం 10 కోట్లు!

    న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ తోపాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ల వార్షిక జీతాలను బిసిసిఐ పెంచినట్లు తెలిసింది. హెడ్ కోచ్ రవిశాస్త్రి గతేడాది వరకు సంవత్సరానికి రూ.8 కోట్లు జీతంగా తీసుకునేవాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ తో రవిశాస్త్రి పదవికాలం ముగియండంతో బిసిసిఐ కొత్త కోచ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, వరల్డ్ కప్ తర్వాత టీమిండియా, విండీస్ జట్టుతో వన్డే, టీ20, టెస్టు సిరీస్ లు […] The post ఏడాదికి రవిశాస్త్రి జీతం 10 కోట్లు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ తోపాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ల వార్షిక జీతాలను బిసిసిఐ పెంచినట్లు తెలిసింది. హెడ్ కోచ్ రవిశాస్త్రి గతేడాది వరకు సంవత్సరానికి రూ.8 కోట్లు జీతంగా తీసుకునేవాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ తో రవిశాస్త్రి పదవికాలం ముగియండంతో బిసిసిఐ కొత్త కోచ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, వరల్డ్ కప్ తర్వాత టీమిండియా, విండీస్ జట్టుతో వన్డే, టీ20, టెస్టు సిరీస్ లు ఆడనుండడంతో రవి శస్త్రీ పదవిని మరో 45 రోజుల పాటు పొడిగించింది.

కపిల్ దేవ్, శాంతా రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత క్రికెట్ సలహా కమిటీ, కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత రవిశాస్త్రినే మళ్లీ హెడ్ కోచ్ పదవికి ఎంపిక చేశారు. తాజాగా రవిశాస్త్రి పదవిని మరో 3 సంవత్సరాలకు బిసిసిఐ పొడిగించింది. ఈ సందర్భంగా రవిశాస్త్రి జీతాన్ని 20 శాతం పెంచినట్లు సమాచారం. దీంతో శాస్త్రి ఏడాదికి 9.5 నుంచి 10 కోట్ల వరకు జీతం పొందనున్నాడు. ఇక, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లుగా కొత్తగా ఎన్నికైన భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్ లు రూ.3.5 కోట్లు తీసుకోనున్నారు. సంజయ్ బంగర్ స్థానంలో బ్యాటింగ్ కోచ్ గా ఎంపికైన విక్రమ్ రాథోర్ రూ.2.5 నుంచి 3 కోట్ల వరకు అర్జించనున్నాడు.

Coach Ravi Shastri earning Rs. 8 crore annually

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఏడాదికి రవిశాస్త్రి జీతం 10 కోట్లు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: