సిఎం పోస్టుపై అమిత్ అంగీకరించారు

Uddhav-Thackeray

 మా నాన్నకు మాటిచ్చా.. శివసైనికుడిని సిఎం చేసి తీరుతాం
తియ్యని మాటలతో సేనను అంతమొందించే యత్నం
మేం అబద్ధాలు చెబుతున్నామనడం బాధించింది
అందుకే ఇక బిజెపితో చర్చలు ఆపేస్తున్నాం : ఉద్ధవ్

ముంబయి : ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఘాటుగా స్పందించారు. మొదటి సారి కొందరు థాక్రే కుటుంబీకులు అవాస్తవాలు, అబద్ధాలు చెబుతున్నారని ప్రకటనలు చేస్తున్నారని, అది తమను తీవ్రంగా బాధిస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన చర్చల్లోనే తమకు డిప్యూటీ సిఎం పదవిని బిజెపి ఆఫర్ చేసిందని, అయితే ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఉద్ధవ్ పేర్కొన్నారు. సిఎం పోస్టుపై తాను చేసిన ప్రతిపాదనను అమిత్ షా అప్పుడే అంగీకరించారని, అందులో అధికార మార్పిడితో పాటు సిఎం పదవి కూడా ఉందని అన్నారు.

తన తండ్రి బాల్‌థాక్రేకు ఇచ్చిన మాట ప్రకారం శివసైనికుడిని సిఎం చేసి తీరుతామని, అందుకు అమిత్ షా, ఫడ్నవీస్ తమకు అక్కర్లేదని అన్నారు. తియ్యని మాటలతో శివసేను అంతం చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఇక బిజెపితో చర్చలు ఆపేస్తున్నామని, ఎందుకంటే తాము అబద్ధాలకోరులమని ప్రచారం చేస్తున్నప్పుడు ఇక చర్చలు ఎందుకని ఉద్ధవ్ ప్రశ్నించారు. ఇప్పటికీ బిజెపి తమ ప్రత్యర్థి అని భావించడంలేదని, అయితే వాళ్లు అబద్ధాలాడకుండా ఉంటే మంచిదన్నారు.

CMs post was promised in Amit Shahs presence

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిఎం పోస్టుపై అమిత్ అంగీకరించారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.