పల్లె ప్రగతిలో మొక్కలు నాటిన స్మిత, ప్రియాంక వర్గీస్

  నిజామాబాద్: పల్లెప్రగతిలో దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో, ప్రణాళికలు ఏమిటో గ్రామ ప్రజలకు తెలియచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. పల్లెప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్‌తో కలిసి మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటుచేసిన గ్రామసభలో పాల్గొని జరుగుతున్న పనులపై , గ్రామ సమస్యలపై ప్రజలతో ముఖాముఖీ మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా వచ్చే నిధులతోపాటు గ్రామ నిధులను కలుపుకుని గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఆమె సూచించారు. […] The post పల్లె ప్రగతిలో మొక్కలు నాటిన స్మిత, ప్రియాంక వర్గీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నిజామాబాద్: పల్లెప్రగతిలో దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో, ప్రణాళికలు ఏమిటో గ్రామ ప్రజలకు తెలియచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులకు సూచించారు. పల్లెప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఒఎస్‌డి ప్రియాంక వర్గీస్‌తో కలిసి మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటుచేసిన గ్రామసభలో పాల్గొని జరుగుతున్న పనులపై , గ్రామ సమస్యలపై ప్రజలతో ముఖాముఖీ మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా వచ్చే నిధులతోపాటు గ్రామ నిధులను కలుపుకుని గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఆమె సూచించారు.

గ్రామాభివృద్ధిపై ప్రజలకు విధిగా తెలియచేయాల్సిన బాధ్యత గ్రామ సర్పంచు, అధికారులపై ఉందని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పారిశుధ్యం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు , హరితహారం కార్యక్రమాలపై అధికారులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఇ సుదర్శన్, డిపిఒ జయసుధ, డిఆర్‌డిఒ రమేష్ రాథోడ్, జిల్లా పరిషత్ సిఇఒ గోవింద్, డిఇఒ జనార్ధన్‌రావు, ఎసిపి శ్రీనివాస్‌కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

CMO Smitha Sabarwal participated in Palle Pragathi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పల్లె ప్రగతిలో మొక్కలు నాటిన స్మిత, ప్రియాంక వర్గీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: