ఎపికి కెసిఆర్ గోదావరం

ఆయనను మెచ్చుకోకుండా విమర్శిస్తున్న చంద్రబాబు వంటి ప్రతిపక్ష నేత ప్రపంచంలోనే ఉండరు : కెసిఆర్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శాసనసభాముఖంగా ప్రశంసల జల్లు ‘ఆల్మట్టి ఎత్తు పెంచినప్పుడు చంద్రబాబు గాడిద పళ్లు తోముతున్నారా?’ మనతెలంగాణ/హైదరాబాద్ : మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గొప్ప ఉదార స్వభావి అని ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ రాష్ట్ర శాసనసభలో గురువారం నాడు కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం కెసిఆర్ తీసుకుంటున్న చర్యలు ఎంతైనా ప్రశంసించదగినవని అన్నారు. […] The post ఎపికి కెసిఆర్ గోదావరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆయనను మెచ్చుకోకుండా విమర్శిస్తున్న చంద్రబాబు వంటి ప్రతిపక్ష నేత ప్రపంచంలోనే ఉండరు :
కెసిఆర్‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శాసనసభాముఖంగా ప్రశంసల జల్లు

‘ఆల్మట్టి ఎత్తు పెంచినప్పుడు చంద్రబాబు గాడిద పళ్లు తోముతున్నారా?’

మనతెలంగాణ/హైదరాబాద్ : మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గొప్ప ఉదార స్వభావి అని ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ రాష్ట్ర శాసనసభలో గురువారం నాడు కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం కెసిఆర్ తీసుకుంటున్న చర్యలు ఎంతైనా ప్రశంసించదగినవని అన్నారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించాలన్న కెసిఆర్ నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. సాగునీటి రంగంలో ఎపికి సహకరిస్తున్న ఆయనను విమర్శిస్తున్న చంద్రబాబు లాంటి ప్రతిపక్షనేత బహుశా ప్రపంచంలోనే మరొకరు ఉండరని జగన్ విమర్శించారు. తెలంగాణ నుంచి దాదాపు 65శాతం గోదావరి నీళ్లను ఎపికి తరలించుకోబోతున్నామన్నారు. నీటి తరలింపు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలన్నారు. ఏపి విన్నపాలను తెలంగాణ సిఎం కెసిఆర్ ఎంతో గౌరవించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్‌ను మెచ్చుకోవాల్సిందిపోయి విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమౌతుందని జగన్ అన్నా రు.

పక్క రాష్ట్రం వాళ్లు ఏం చేసినా ఇటు వైపు మనమేమీ చేయగలిందేమీ లేదని, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా ఇది నగ్నసత్యమన్నారు. సిఎం కెసిఆర్‌కు మనకు మధ్య ఉన్న సత్సంబందాల దృష్టా ఆయనను ఆంధ్రప్రదేశ్‌ను ఆదరిస్తున్నారన్నారు. మన రాష్ట్రానికి గోదావరి నీళ్లను శ్రీశైలం, నాగార్జున సాగర్ తరలిస్తున్నామంటే అలాగే కృష్ణ ఆయకట్టు స్థిరీకరించే పరిస్థితి జరుగుతోందంటే కెసిఆర్ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. గోదావరి నీళ్లు పోలవరం దిగువ నుంచి తీసుకోవడం లేదని, తెలంగాణ రాష్ట్ర నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తీసుకెళుతున్నామంటే కెసిఆర్ గొప్పతనమేనన్నారు. కెసిఆర్ ఉదార స్వభావానికి సంతోషించాల్సింది పోయి అరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గోదావరిలో నాలుగు పాయలున్నాయని అందులో ఒకటి నాసిక్ నుంచి వచ్చే పాయ, అది ప్రస్తుతం ఎండిపోయిన పోయిన పరిస్థితిలో ఉందన్నారు. నాసిక్ నుంచి తెలంగాణకు నీళ్లు రాని పరిస్థితి ఉందన్నారు .

రెండోది ప్రాణహిత పాయ నుంచి 36శాతం గోదావరి నీళ్లు వస్తున్నాయని, మూడవది ఇంద్రవతి 26 శాతం వాటర్ ఈ రెండు పాయలు తెలంగాణ మీదుగా వస్తున్నాయన్నారు. కేవలం ఈ రెండు పాయల నుంచి 65శాతం గోదావరి నీళ్లు ఎపికి వస్తున్నాయి. నాలుగోదైన శబరి పాయ నుంచి కేవలం 11శాతం నుంచి గోదావరి నీళ్లు వస్తున్నాయి. ఎపి రాష్ట్రంలో ప్రవహించే శబరి నుంచి కేవలం 500 టిఎంసిల నీరు వస్తోందని వివరించారు. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 65 శాతం గోదావరి నీళ్లు వస్తున్నాయంటే సిఎం కెసిఆర్ చలువవల్లే వస్తున్నాయని గుర్తించాలన్నారు. పక్క రాష్ట్రం వారితో గొడవలు, కోర్టులతో సమస్యలు పరిష్కారం కావన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 టిఎంసిల నీరు మహారాష్ట్ర ఆల్మట్టి నీరు తరలించుకుపోతే ఏం? చేశారని వైఎస్ జగన్ ఎద్దేవ చేశారు. ఆల్మట్టి ఎత్తును 519 అడుగుల నుంచి 524 పెంచడం వల్ల ఆల్మట్టిలో 110 టిఎంసిల నీటి నిల్వ సామ్యర్థ పెరిగిందని, అయినా మనమేమీ చేయలేకపోయామన్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి, రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సత్సంబందాలుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

ఆ పరిస్థితి ఈ రోజు ఎపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉండటం వల్ల సిఎం కెసిఆర్ ఒక అడుగు ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల నుంచి కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ కోసం సహాయ,సహకారాలు అందిస్తున్నారన్నారు. కాగా శ్రీశైలంకు నీళ్లొస్తే మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీరందుతుందని అలాగే నాగార్జున సాగర్‌కు నీళ్లొస్తే ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కు సాగునీరు అందుతాయని సిఎం కెసిఆర్ భావనన్నారు. అదేవిధంగా కృష్ణా ఆయకట్టు ప్రశ్నార్థకమైతే తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డిలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. మన రాష్ట్రంలోని 8 జిల్లాలు అందులో రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురంతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరి వరకు కృష్ణా ఆయకట్టు ప్రశ్నార్థకమౌతాయన్నారు. ఈ విషయంలో మనం అడిగిన వెంటనే కెసిఆర్ ఉదార స్వభావంతో అంగీకరించడం ఆపై ఇద్దరం కలిసి కృష్ణ నీటిని గోదావరి నీళ్లను నాగార్జున సాగర్‌కు తరలించేందుకు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలలోనూ రాజకీయాలు వెతికి రాజకీయాలు చేసేవారు ప్రపంచంలో చంద్రబాబు తప్ప ఇంకెవ్వరూ ఉండరని ఎద్దేవ చేశారు. ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు నీటి తరలింపు విషయంలో చర్చలు జరుపుతున్నారన్నారు. పై రాష్ట్రాల వారు కట్టుకుంటూ పోతూనే ఉంటారని మనము ఏం చేయాలేమన్నారు. ముఖ్యమంత్రుల మధ్య కలిసి పనిచేసే గుణం ఉండాలన్నారు.
నిందలు కాదు..అభినందించాలి
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించండి. కెసిఆర్‌ను అభినందించడం మానేసి విమర్శిస్తారా?అని ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రాజెక్ట్‌లపై చర్చ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాలని ప్రతిపక్షం అడుగుతోంది. పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే వెళ్లాను. ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన విన్నపాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ గౌరవించారు. ఆయన ఓ అడుగు ముందుకేసి తన రాష్ట్రం నుంచి నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. తెలంగాణ నుంచి గోదావరి నీటిని తీసుకుంటున్నాం. శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా ఆయకట్టుకు నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోదన్నారు.
చంద్రబాబు గాడిదల్ని కాశారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో కాళేశ్వరం కడుతుంటే గాడిదలు కాశారా? అని సిఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు?. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఆయన అధికారంలో ఉండగానే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు తరలించేందుకు తెలంగాణ రాష్ట్రంతో స్నేహభావంతో మెలగడం తప్పా?. దేశవ్యాప్తంగా పక్క రాష్ట్రాలతో సఖ్యత ఉండాలి. సఖ్యత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు చక్రం తిప్పుతున్న రోజుల్లోనే ఆల్మట్టి డ్యామ్ 519 అడుగుల నుంచి 524 అడుగుల ఎత్తు పెంచారు. గత పదేళ్లలో కృష్ణా జలాల లభ్యత దారుణంగా పడిపోయిందని వైఎస్ జగన్ వివరించారు.

CM YS Jagan Praises Telangana CM KCR In AP Assembly

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎపికి కెసిఆర్ గోదావరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: