అరెస్ట్ చేసుకుంటు పోతే…జర్నలిస్టులు ఉండరు: రాహుల్

ఢిల్లీ: యుపిలో జర్నలిస్ట్ అరెస్ట్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాత్రికేయుడు ప్రశాంత్ కనోజియాను అరెస్టు చేసి యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ అప్రతిష్టపాలయ్యాడని దుయ్యబట్టారు. యోగి మూర్ఖుడిలా పాలనా సాగిస్తున్నారని తన ట్విట్టర్ లో రాహుల్ ట్వీట్ చేశారు. సదరు పాత్రికేయుడిని వెంటనే విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. సదరు పాత్రికేయుడిని వెంటనే విడుదల చేయాలని యుపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. […] The post అరెస్ట్ చేసుకుంటు పోతే… జర్నలిస్టులు ఉండరు: రాహుల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: యుపిలో జర్నలిస్ట్ అరెస్ట్‌పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాత్రికేయుడు ప్రశాంత్ కనోజియాను అరెస్టు చేసి యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్ అప్రతిష్టపాలయ్యాడని దుయ్యబట్టారు. యోగి మూర్ఖుడిలా పాలనా సాగిస్తున్నారని తన ట్విట్టర్ లో రాహుల్ ట్వీట్ చేశారు. సదరు పాత్రికేయుడిని వెంటనే విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. సదరు పాత్రికేయుడిని వెంటనే విడుదల చేయాలని యుపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాస్తున్నారని అరెస్ట్ చేసుకుంటూ పోతే న్యూస్ పేపర్లు, ఛానళ్లు, జర్నలిస్టులు కనిపించరన్నారు.బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ సహకారంతో తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వారిని జైల్లో పెడితే వార్తా ఛానళ్లు, జర్నలిస్టుల కొరత ఏర్పడుతుందన్నారు. ఓ మహిళ యోగిని పెళ్లి చేసుకుంటానన్న వీడియోను ప్రశాంత్ తన ఫేస్‌బుక్, ట్విట్టర్ పోస్టు చేశాడు. దీంతో యోగి ప్రభుత్వం ప్రశాంత్‌ను పోలీసులచే అరెస్టు చేయించింది. ఆ ఛానెల్ అధిపతి ఇషికా సింగ్, ఎడిటర్ అనూజ్ శుక్లా, విలేకరి ప్రశాంత్ కనోజియా సహా ముగ్గురు జర్నిలిస్టులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

CM Yogi “Behaving Foolishly”: Rahul On Journalist Arrests

The post అరెస్ట్ చేసుకుంటు పోతే… జర్నలిస్టులు ఉండరు: రాహుల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: