మన పథకాలే భేష్

  కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు మొండిచెయ్యే డబ్లింగ్ పనులకు రూ.200 కోట్లు మునిరాబాద్ రైల్వేలైన్‌కు రూ.270 కోట్లు పాలమూరు ఎత్తిపోతలను పట్టించుకోని కేంద్రం కిసాన్ సమ్మాన్ పథకం కంటే రైతుబంధే మేలు దేశానికే ఆదర్శమైన కెసిఆర్ సంక్షేమ పథకాలు  మన తెలంగాణ / మహబూబ్‌నగర్: ఇటీవల కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ముఖ్యమంత్రి కెసిఆర్ కల్పించిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా ఉన్నాయంటూ జిల్లా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ ప్రవేశపెట్టిన […]

 

కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు మొండిచెయ్యే
డబ్లింగ్ పనులకు రూ.200 కోట్లు
మునిరాబాద్ రైల్వేలైన్‌కు రూ.270 కోట్లు
పాలమూరు ఎత్తిపోతలను పట్టించుకోని కేంద్రం
కిసాన్ సమ్మాన్ పథకం కంటే రైతుబంధే మేలు
దేశానికే ఆదర్శమైన కెసిఆర్ సంక్షేమ పథకాలు 

మన తెలంగాణ / మహబూబ్‌నగర్: ఇటీవల కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ముఖ్యమంత్రి కెసిఆర్ కల్పించిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా ఉన్నాయంటూ జిల్లా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు పెద్దగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో జిల్లా ప్రజలు ఊసురోమంటున్నారు. కేంద్ర బడ్జెట్‌లో జిల్లాకు న్యాయం జరుగుతుందని భావించినప్పటి కీ ప్రజల ఆశలన్ని అడియాశలయ్యాయి. కొ న్నింటికి కేవలం అరకొర నిధులిచ్చి కేంద్ర ప్ర భుత్వం చేతులు దులుపుకుంది. ముఖ్యమైన ప్రాజెక్టుల జోలికి వెళ్లకపోవడంపై ప్రజలు పె దవి విరుస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రా ష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు, రంగారెడ్డి ప థకానికి కూడా జాతీయ హోదా కల్పించడం వీలు కాకపోతే ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ అనేకమార్లు కేం ద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది.

12 లక్షల ఎకరాలకు సాగు, తాగు నీరుకు ఉపయోగపడే పాలమూరు, రంగారెడ్డి పథకం నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇచ్చిన విధంగా నే ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు ఉం టాయని జిల్లా ప్రజలు ఆశించారు. అయి తే ఆ ఊసే లేకపోవడం జిల్లా ప్రజలకు ని రుత్సాహానికి గురి చేసింది. అలాగే సైనిక స్కూల్ ఏర్పాట్లలో కూడా పెద్దగా కేంద్రం స్పందించలేదు. సికింద్రాబాద్ నుండి మహబూబ్‌నగర్ వరకు కొనసాగే డబ్లింగ్ లైన్ పనులకు కేవలం 200 కోట్లు ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2015,16 సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు డబ్లింగ్ పనులు చేసేందుకు రూ.728 కోట్లతో ప్రారంభించారు. ప్రస్తుతం 200 కోట్లు కేటాయించడంతో పనులు వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా డబ్లింగ్ లైన్ పనులతో పాటు 9 మేజర్ 91 మైనర్ బ్రిడ్జిల పనులు పురోగతిలో ఉన్నాయి.

ఎంతో కాలంగా పాలమూరు ప్రజలు ఎదురుచూస్తున్న గ ద్వాల, మాచర్ల, వికారాబాద్, కృష్ణ లైన్లకు కేంద్ర బడ్జెట్‌లో మొండిచెయ్యే ఎదురైంది. ఇదిలా ఉండగా మునిరాబాద్ నుండి మహబూబ్‌నగర్ కొత్త లైన్‌కు 1997లో రూ.645 కోట్లను మంజూరు జరిగింది. 248 కిలోమీటర్ల మేర కొత్తలైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో భాగంగా దేవరక ద్ర నుంచి జక్లేర్ వరకు 29 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. పాలమూరు జిల్లా పరిధిలో పనులు పూర్తయినప్పటికీ కర్ణాటకలోని మునిరాబాద్ వెళ్లే రైల్వేలైన్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.275 కోట్లు కేటాయించారు.

మా రైతుబంధే మేలు:
కేంద్ర బడ్జెట్‌లో నూతనంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఏ డాదికి రూ.6వేలు ఇచ్చే పథకం కంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకమే బాగుందని అనేక మంది రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 3,60,000 మంది సన్నకారు రైతులు ఉంటున్నారు. వీరికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఏడాదికి రూ.10వేలు చొప్పున రెండు విడతలుగా నేరుగా రైతు ఖాతాలో వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ పథకం కింద రూ.6వేలు ఏ మాత్రం రైతుకు ఉపయోగకరంగా లేదని అది కూడా మూడు విడతలుగా రైతు అకౌంట్లో వేస్తామని చెప్పడం భావ్యంగా లేదని రైతులు పేర్కొంటున్నారు.

అంతే కాకుండా ప్రధానమంత్రి శ్రమయో గి బంధన్ కంటే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పింఛ న్ పథకాలే బాగున్నాయని పింఛన్‌దారులు పేర్కొంటున్నా రు. అంతే కాకుండా రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకొచ్చిన రైతు బీమా పథకం దేశంలోనే ఆదర్శంగా ఉందని రైతులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తు గాని, అకాల స్తేప్రపంచంలో విధంగా జమ చేయడం గ ర్వంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మా సిఎం పథకాలే బాగున్నాయని అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

cm kcr welfare schemes in Mahaboob nagar district

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: