సీమకు గోదావరి

మనతెలంగాణ/హైదరాబాద్: రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉందని సిఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు క్రియాశీలకంగా పట్టుదలతో పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సా ధ్యమవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల బాధలు తెలిసిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. రాయలసీమ ఇబ్బందులు తన కు తెలుసునని, వంద శాతం తన ఆశీస్సు లు, సంపూర్ణ సహకారం ఎపికి ఉంటుందని హా మీ ఇచ్చారు. సోమవారం తమిళనాడులోని కాం చీపురంలో అత్తివరదరాజస్వామి ముఖ్యమంత్రి […] The post సీమకు గోదావరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉందని సిఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు క్రియాశీలకంగా పట్టుదలతో పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సా ధ్యమవుతుందని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల బాధలు తెలిసిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. రాయలసీమ ఇబ్బందులు తన కు తెలుసునని, వంద శాతం తన ఆశీస్సు లు, సంపూర్ణ సహకారం ఎపికి ఉంటుందని హా మీ ఇచ్చారు. సోమవారం తమిళనాడులోని కాం చీపురంలో అత్తివరదరాజస్వామి ముఖ్యమంత్రి కెసిఆర్ దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరిన సిఎం కెసిఆర్ తొలుత రేణిగుంట చేరుకొని అక్కడినుంచి రోడ్డు మార్గం లో కంచి చేరుకున్నారు. నగరిలో ఎపిఐఐసి ఛైర్మన్, నగరి  ఎంఎల్‌ఎ ఆర్‌కె రోజా స్వాగతం పలికారు. కాంచీపురం వరదరాజుస్వామి ఆలయం దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో రోజా నివాసానికి వెళ్లారు. రోజా నివాసంలో సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులు భోజనం చేశారు. అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరే ముందు రోజా నివాసంలో సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. అత్తివరదరాజస్వామి దర్శనం బాగా జరిగిందని అన్నా రు. “నా కుమార్తె రోజా నాకు మంచి ఆతిథ్యమిచ్చారు. అన్నదాత, సుఖీభవ” అంటూ సిఎం కెసిఆర్ ఆమెను దీవించారు.

నీళ్ల విషయంలో ఇప్పటికే తాను, వైఎస్ జగన్ కలిసి చర్చలు జరిపామని తెలిపారు. ఇప్పుడు ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడుతున్నాయని, ఆ నీరు వృధా కాకుండా ప్రజలకు ఉపయోగపడాలని ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పారు. సుమారు 1000 టిఎంసిల గోదావరి జలాలు వృధాగా సముద్రం పాలు అవుతున్నాయని, వాటినలా వదిలేయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నా రు. గత 60–70 ఏళ్ల తెలుగువాళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా, సరికొత్త అధ్యాయాన్ని తాను జగన్ కలిసి లిఖించబోతున్నామని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం కొందరికి అర్థం కాకపోవచ్చు, మరి కొందరికి జీర్ణంకాక, అజీర్తి కావొచ్చని పేర్కొన్నారు. ప్రజల దీవెన ఉంటే రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి, దేవుడిచ్చిన సకలశక్తులను ఒడ్డుతామని సిఎం కెసిఆర్ అన్నారు. రాయలసీమ అభివృద్దికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అక్కడి నుంచి రేణిగుంట వినానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ కుమార్తె, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.

Cm Kcr Wants Godavari Water To Rayalaseema

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సీమకు గోదావరి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: