అత్తి వరదరాజస్వామి సేవలో..

కుటుంబ సమేతంగా దర్శించుకున్న సిఎం కెసిఆర్.. తిరుపతిలో ఘనస్వాగతం మనతెలంగాణ/ తిరుమల ప్రతినిధి: 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే వెలుపలికి వచ్చి దర్శనమిచ్చే అరుదైన అవకా శం కలిగిన కాంచీపురం శ్రీఅత్తి వరదరాజ స్వామి వారి ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కెసిఆర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా సోమవారం మధ్యాహ్నం తమిళనాడులోని కాంచీపురం చేరుకున్న కెసిఆర్ దంపతులకు ప్రభుత్వ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దారు. స్వామివారి సన్నిధిలో ఆయనకు […] The post అత్తి వరదరాజస్వామి సేవలో.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కుటుంబ సమేతంగా దర్శించుకున్న సిఎం కెసిఆర్.. తిరుపతిలో ఘనస్వాగతం

మనతెలంగాణ/ తిరుమల ప్రతినిధి: 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే వెలుపలికి వచ్చి దర్శనమిచ్చే అరుదైన అవకా శం కలిగిన కాంచీపురం శ్రీఅత్తి వరదరాజ స్వామి వారి ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కెసిఆర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా సోమవారం మధ్యాహ్నం తమిళనాడులోని కాంచీపురం చేరుకున్న కెసిఆర్ దంపతులకు ప్రభుత్వ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దారు. స్వామివారి సన్నిధిలో ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించే తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు స్వామి వారి శేష వస్త్రాలు బహుకరించారు. అంతకుముందు కంచికి వెళ్లే మార్గమైన చిత్తూరు జిల్లా నగరి ప్రాంతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ ఆర్‌కె రోజా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఘన స్వాగతం పలికా రు. మర్యాదపూర్వకంగా తొలుత కలుసుకున్న ఆర్‌కె రోజా తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తన స్వగృహం లో విందు భోజనం ఏర్పాటు చేశారు.

తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి ఘన వీడ్కోలు లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిదున్ రెడ్డి, శాసన సభ్యులు సత్యవేడు ఆదిమూలం, పూతలపట్టు బాబు, శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన రెడ్డి, పలమనేరు వెంకటగౌడ, జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, తిరుపతి ఆర్డీఓ కనక నరసారెడ్డి, తహసీల్దార్ రేణిగుంట విజయసింహా రెడ్డి, రూరల్ కిరణ్ కుమార్, తెలంగాణ సి.ఎం.సెక్యూరిటీ ఆఫీసర్ ఎం.కె.సింగ్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ సురేష్, సిఐ ఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శుక్లా, ఆసిస్టెంట్ టర్మీనల్ మేనేజర్ శ్యామ్, డిటీలు నాయకులు అభినయ్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వల్లివేడు పృథ్వి రెడ్డి, పోకల అశోక్ కుమార్, డిటిలు శ్యామప్రసాద్, శివప్రసాద్ తదితరులు వారిలో వున్నారు.

 CM KCR Visits Athi Varadaraja Swamy Temple

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అత్తి వరదరాజస్వామి సేవలో.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: