రైతును రాజును చేయడమే కెసిఆర్ లక్ష్యం : పువ్వాడ

ఖమ్మం : రైతును రాజును చేయడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని పెనుబల్లి అడవిమల్లెల గ్రామంలో మంగళవారం ఆయన రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, గిట్టుబాటు ధర తదితర అంశాల్లో తెలంగాణ దేశంలోనే ఆదర్శనీయంగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. సమైక్య […] The post రైతును రాజును చేయడమే కెసిఆర్ లక్ష్యం : పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం : రైతును రాజును చేయడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని పెనుబల్లి అడవిమల్లెల గ్రామంలో మంగళవారం ఆయన రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, గిట్టుబాటు ధర తదితర అంశాల్లో తెలంగాణ దేశంలోనే ఆదర్శనీయంగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ రైతులు అన్ని విధాల నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణ ఏర్పడిన అనంతరం సిఎం కెసిఆర్ పాలనలో రైతుల కష్టాలు తీరాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయం పండుగలా మారిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య,  ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ , అదనపు కలెక్టర్ స్నేహలత, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, డిసిఎంఎస్ఎ చైర్మన్ శేషగిరిరావులతో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రైతును రాజును చేయడమే కెసిఆర్ లక్ష్యం : పువ్వాడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: