నేడు తిరుపతికి సిఎం కెసిఆర్

CM KCRహైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరుపతి పర్యటన ఖరారైంది. ఆదివారం సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళతారని సిఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువరించారు. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి వెళ్లి అక్కడే రాత్రి బస చేసి సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి సిఎం కెసిఆర్ మొక్కులు చెల్లించేందుకు తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే.

స్వామివారిని దర్శించుకుని బంగారు ఆభరణాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు ఆభరణాలను సమర్పిస్తానని మొక్కుకున్న కెసిఆర్, రూ.5 కోట్లతో బంగారు ఆభరణాలు తయారు చేయించారు. సిఎం కెసిఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యు లు, కొందరు మంత్రులు కలిసి తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు.

CM KCR to Visit Tirumala Tirupati Devasthanam

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేడు తిరుపతికి సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.