మధ్యాహ్నం లాక్‌డౌన్ పై సిఎం కెసిఆర్ సమీక్ష

CM KCR

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రస్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పై పరిస్థితిని సమీక్షించనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై, లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో సిఎస్, డిజిపి, వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సిఎం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పిలు, పోలీస్ కమిషనర్లతో సిఎం కెసిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడనున్నారు.

CM KCR to Review on Lockdown at Pragathi Bhavan

The post మధ్యాహ్నం లాక్‌డౌన్ పై సిఎం కెసిఆర్ సమీక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.