స్టాలిన్ తో నేడు భేటీ

తమిళనాడు పర్యటనకు వెళ్లిన సిఎం కెసిఆర్ శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి నేటి సాయంత్రం చెన్నైలో స్టాలిన్‌తో సమావేశం ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం దిశగా మరో ముఖ్యమైన అడుగు లోక్‌సభ ఫలితాలు వెల్లడయ్యేనాటికే ఫ్రంట్ మన తెలంగాణ/హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముమ్మరం చేశారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతును సమీకరించే సన్నాహాల్లో భాగంగా సిఎం కెసిఆర్ సోమవారం డిఎంకె అధినేత ఎం.కె.స్టాలిన్‌తో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. […] The post స్టాలిన్ తో నేడు భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
తమిళనాడు పర్యటనకు వెళ్లిన సిఎం కెసిఆర్

శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి
నేటి సాయంత్రం చెన్నైలో స్టాలిన్‌తో సమావేశం
ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం దిశగా మరో ముఖ్యమైన అడుగు
లోక్‌సభ ఫలితాలు వెల్లడయ్యేనాటికే ఫ్రంట్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముమ్మరం చేశారు. ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతును సమీకరించే సన్నాహాల్లో భాగంగా సిఎం కెసిఆర్ సోమవారం డిఎంకె అధినేత ఎం.కె.స్టాలిన్‌తో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో తమిళనాడు పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సిఎం కెసిఆర్ ఈ నెల 6వ తేదీన దక్షిణాది రాష్ట్రాల పర్యటనను చేపట్టి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను సందర్శించారు. కేర ళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమై దేశ రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికల అనంతరం తలెత్తే పరిణామాలపై చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటనను ముగించుకుని శు క్రవారం హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.

మళ్లీ ఆదివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరి వెళ్లారు. రాత్రి చెన్నైలో బస చేసి, సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను సందర్శించుకుంటారు. సోమవారం సాయంత్రం స్టాలిన్‌తో భేటీ అవుతారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, రాజకీయ పరిణామాలు, ప్రాంతీయ పార్టీల సన్నద్ధత ఇతర అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం తలెత్తే పరిణామాలు, కేంద్ర ంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై చర్చిస్తారు.

CM KCR To Meet DMK Leader M K Stalin On May 13

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్టాలిన్ తో నేడు భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: