విహాంగవీక్షణం ద్వారా కరివెన జలాశయాన్ని పరిశీలించిన కెసిఆర్

CM KCRమహబూబ్‌నగర్‌ : తెలంగాణ సిఎం కెసిఆర్ మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పిఎల్ఐ) పనులను పరిశీలించారు. గురువారం ఉదయం ఆయన పిఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని కరివెన జలాశయాన్ని విహాంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. కరివెన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పూర్తి కావడానికి అధికారులు అంకితభావంతో పని చేయాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు.

CM KCR Surveying Karivena Reservoir

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విహాంగవీక్షణం ద్వారా కరివెన జలాశయాన్ని పరిశీలించిన కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.