ఎన్నికల తర్వాత బిజెపికి శంకరగిరి మాన్యాలే

నల్గొండ: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో టిఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. 16 లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్ మలివిడత ప్రచారం ప్రారంభించారు. ఈ సభకు జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రజాప్రతినిథులు, టిఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. నల్గొండ నియోజకవర్గం పరిధి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, వ్యక్తులు కాదని.. ప్రజల అభిమతం, […]

నల్గొండ: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో టిఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. 16 లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్ మలివిడత ప్రచారం ప్రారంభించారు. ఈ సభకు జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రజాప్రతినిథులు, టిఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. నల్గొండ నియోజకవర్గం పరిధి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, వ్యక్తులు కాదని.. ప్రజల అభిమతం, వారి కోరిక అని అన్నారు. ప్రజలు ఎవరిని గెలిపించాలని అనుకుంటారో వారే గెలవాలని చెప్పారు. ఆర్థిక ప్రగతి, 24 గంటల విద్యుత్ విషయంలో అగ్రస్థానంలో ఉన్నామని, సౌర విద్యుత్ విషయంలో రెండో స్థానంలో ఉన్నామని, ఈ ప్రగతిని చూసే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు అద్భుత విజయాన్ని అందించారని సిఎం తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బందీలుగా ఉన్నామని చెప్పిన కెసిఆర్… ఇప్పుడు స్వతంత్రులు అయ్యామని గుర్తు చేశారు. రైతుల పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యతను తీసుకుంటా అని పేర్కొన్నారు. ఓట్లు, రాజకీయాల కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో 103 స్థానాల్లో బిజెపి డిపాజిట్లు కోల్పోయి కేవలం ఒక్క స్థానంలో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇచ్చేది చాలా తక్కువని, దీని కంటే ఆరోగ్య శ్రీ పథకం ఎన్నో రెట్లు గొప్పదన్నారు. మోడీ హయాంలో ప్రజలకు జరిగిందేమి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ రహిత భారత్ చేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారని, బిజెపి లేని భారత్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, దేశంలో గాంధీలు ఒకవైపు.. చౌకీదారులు మరోవైపు ఉన్నారని ఎద్దేవా చేశారు. బిసిలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయమంటే పట్టించుకోలేదని.. కాంగ్రెస్, బిజెపి హయాంలో బిసిలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు కాలేదని విమర్శించారు.

దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు. ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ భరతం పడతామని బిజెపి పగటికలలు కంటోందని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఎకు 150.. కాంగ్రెస్ కు 100 సీట్లు కూడా రావని అన్నీ జాతీయ సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. దేశ పాలన ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి రాబోతోందని కెసిఆర్ జోస్యం చెప్పారు. సరిహద్దుల్లో తరచూ దాడులు జరుగుతాయని, వ్యూహత్మక దాడుల గురించి బయట చెప్పకూడదు, మరోవైపు చీమ కూడా చావలేదని మసూద్ అజార్ చెబుతున్నాడని అన్నారు. పథకాల అమలులో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని, ఎన్నికల తర్వాత బిజెపికి శంకరగిరి మాన్యాలేనని, ప్రాంతీయ పార్టీల చేతుల్లోకి పగ్గాలు వస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. టిఆర్ఎస్ గెలిస్తే చెవు కోసుకుంటానని సిపిఐ నారాయణ చెప్పారని, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్తమ కుమార్ రెడ్డి చెప్పారని సిఎం గుర్తు చేశారు. వంద కోట్లు తీసుకొని నర్సింహారెడ్డికి టికెట్ ఆరోపిస్తున్నారని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పుకోసం సర్వశక్తులు ఒడ్డుతానని, అవసరమైతే జాతీయపార్టీ పెట్టి మార్పులకు శ్రీకారం చూడుతానని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ వస్తేనే దేశానికి ఉన్న దరిద్రం పోతుందన్నారు.

CM KCR Speech In Miryalaguda Bahiranga Sabha

Related Stories: